హైదరాబాద్లో విషాదం.. కౌకూరు విల్లా ఆర్కిడ్స్లో.. పాపను చంపి సంపులో పడేసిన సెక్యూరిటీ గార్డ్ !

హైదరాబాద్లో విషాదం.. కౌకూరు విల్లా ఆర్కిడ్స్లో.. పాపను చంపి సంపులో పడేసిన సెక్యూరిటీ గార్డ్ !

హైదరాబాద్: బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కౌకూరులోని విల్లా ఆర్కిడ్స్లో కిడ్నాప్కు గురైన ఐదు సంవత్సరాల ఆలియా (మోను)అనే పాపను సెక్యూరిటీ గార్డ్ హత్య చేశాడు. దీంతో పాప బతికే ఉందన్న తల్లిదండ్రులు ఈ ఘటనతో షాక్లోకి వెళ్లిపోయారు. 

ఈ ఘటనతో విల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి. విల్లాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న విక్రమ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. ముందు కిడ్నాప్ కోణంలో సెర్చ్ ఆపరేషన్ చేసిన పోలీసులు.. సెక్యూరిటీ గార్డు ఫోన్ లొకేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఎండ్ కావడంతో పోలీసులు టీమ్స్గా ఏర్పడి గాలించారు.

అలాగే డ్రోన్స్ సహాయంతో సెర్చ్ ఆపరేషన్ చేశారు. సీసీ కెమెరాలు చెక్ చేసిన పోలీసులుకు పాప ఉంటున్న విల్లాకు ఒకే ఎంట్రెన్స్ ఉండడంతో అనుమానం వచ్చి పలుమార్లు సిసి కెమెరాలు చేయగా సిసి కెమెరాల్లో నిందితుడు సెక్యూరిటీ గార్డు విక్రమ్ ఒక్కడే బయటకు వెళ్లినట్లు తేలింది. పాప ఉండే విల్లా కాలనీ మొత్తంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, లాడ్జీలను జల్లాడ పట్టారు. కానీ పాప ఉంటున్న ఇంటికి దగ్గర్లో క్లబ్ హౌజ్ మాత్రం ఎవరు చెక్ చేయలేదు.

క్లబ్ హౌజ్ దగ్గరే పాప వాడే సైకిల్ కనిపించింది. అనుమానం వచ్చిన పోలీసులు విల్లా క్లబ్ హౌజ్ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా అదే బిల్డింగ్ సెల్లార్ నీటిలో పాప డెడ్ బాడీ దొరికింది. కిడ్నాపర్ సెక్యూరిటీ గార్డు విక్రమ్ పాప కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో బట్టలు కుక్కి తల్లిదండ్రులకు ఫోన్ చేసి 20 లక్షలు డిమాండ్ చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడ దొరికిపోతాడనే భయంతో విక్రమ్.. పాప గొంతు నులిమి చంపేసిన అనంతరం సెల్లార్లో ఉన్న నీటిలో పాప డెడ్ బాడీ పడేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

పాప మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు క్లూస్ టీం చెకింగ్ అనంతరం పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు విక్రమ్ కోసం మల్కాజ్ గిరి జోన్ పోలీసులు గాలిస్తున్నారు.