అపోలో మెడిక‌‌‌‌‌‌‌‌ల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ సెర్మనీ..విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన డాక్టర్ సోమరాజు

అపోలో మెడిక‌‌‌‌‌‌‌‌ల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ సెర్మనీ..విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన డాక్టర్ సోమరాజు

హైదరాబాద్, వెలుగు: అపోలో ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఏఐఎంఎస్ఆర్)కాలేజీ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని జూబ్లీహిల్స్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేర్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ బి. సోమరాజు ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా 2020 బ్యాచ్ కి చెందిన 97 మంది అండర్ గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్) విద్యార్థులు, 2022 బ్యాచ్ కు చెందిన 44 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ (ఎండీ/ఎంఎస్) విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతిభావంతులైన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ కూడా ప్రదానం చేశారు.

2020 యూజీ బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు చెందిన మాయా దేవి కోచర్లకోటకు ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి గోల్డ్ మెడల్ లభించింది. అలాగే, జనరల్ మెడిసిన్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పీజీ విద్యార్థిని  సముద్రాల కావ్య కూడా డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి గోల్డ్ మెడల్‌‌‌‌‌‌‌‌ను దక్కించుకున్నారు. అలాగే, దివంగత సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ కే.వి.ఆర్. ప్రసాద్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక గోల్డ్ మెడల్‌‌‌‌‌‌‌‌ను 2020 యూజీ బ్యాచ్ విద్యార్థిని వెల్లూరు శర్వన్ శ్రీ రమ్య అందుకున్నారు. కాలేజీ డీన్ డాక్టర్ కె. మనోహర్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులనుద్దేశించి మాట్లాడగా.. సీఓఓ అపరిణారెడ్డి సభకు హాజరైనవారికి స్వాగతం పలికారు.