ఆక్లాండ్: స్వదేశంలో ఇండియా క్రికెట్ జట్టుతో జరగనున్న సిరీస్‌లకు ముందు న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎడమ తొడ కండరాల గాయంతో యంగ్ పేసర్ విల్ ఓ రూర్క్.. టీమిండియాతో జరిగే సిరీస్‌ల నుంచి తప్పుకున్నాడు.
ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలనే ఉద్దేశంతో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కివీస్ బోర్డు ప్రకటించింది. డిసెంబర్‌లో జరగనున్న ఆస్ట్రేలియా టూర్ వరకు విల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించేలా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని కివీస్ కోచ్ రాబ్ వాల్టర్ వెల్లడించాడు.
ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఈ నెల 22 నుంచి క్రైస్ట్ చర్చ్ వేదికగా ప్రారంభంకానున్న ఈ టూర్‌లో 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇప్పటికే మార్క్ చాప్‌మన్, జాక్ ఫౌల్స్ గాయాల కారణంగా టీ20 సిరీస్‌కు దూరమయ్యారు.
