న్యూఢిల్లీ: ఇండియా ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) నూతన కార్యవర్గ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ప్రస్తుత కమిటీ పదవీకాలం ముగియడానికి ఐదు రోజుల ముందు అంటే డిసెంబర్ 5న కొత్త ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎన్నిక జరగనుంది. ఢిల్లీ, చండీగఢ్ మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవను రిటర్నింగ్ అధికారిగా నియమించారు.
జాతీయ క్రీడా పాలనా చట్టం, ఒలింపిక్ చార్టర్‌కు అనుకూలంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఐవోఏ వెల్లడించింది. నవంబర్ 3న ఐవోఏ అథ్లెటిక్స్ కమిషన్ పోలింగ్, కౌంటింగ్‌ను నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ కమిషన్‌లో చెరో ఐదుగురు చొప్పున మెన్స్, విమెన్స్‌తో కూడిన సభ్యులు ఉంటారు.
