బులవాయో: చరిత్రలో తొలిసారి ఇండియాలో పర్యటించనున్న జింబాబ్వే విమెన్స్ టీమ్‌ను ప్రకటించారు. ఈ నెల 16 నుంచి సిరీస్ ప్రారంభమవుతుంది. ఆల్‌రౌండర్ జోసెఫిన్ నకోమో టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఈ నెల 16, 18, 20 తేదీల్లో రాయ్‌పూర్ వేదికగా మూడు టీ20లు, 23, 25, 28 తేదీల్లో వడోదరలో వన్డేలు ఆడనున్నారు.
జింబాబ్వే జట్టు: జోసెఫిన్ నకోమో (కెప్టెన్), బిలవ్డ్ బిజా, చిపో ముగేరి-తిరిపానో, కెలిస్ నధ్లోవు, మిచెల్ మావుంగా, ఫ్రాన్సిస్కా చిపారే, ఒలిందర్ చారే, కుద్జై చిగోరా, న్యాషా గ్వాంజురా, నోమ్‌వెలో సిబాండా, లోరిన్ ఫిరి, చియేడ్జా ధురురు, మోడెస్టర్ ముపాచిక్వా, తెందై మకుషా, షార్నే మేయర్స్.
