సిరియా: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సిరియాలో పర్యటిస్తున్న క్రమంలో.. సిరియా రాజధాని డమాస్కస్‌లో రెండు పేలుళ్లు సంభవించడం కలకలం రేపింది. ఈ పేలుళ్లకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. మంగళవారం ఈ పేలుళ్లు సంభవించాయి.
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ టార్గెట్‌గా ఈ పేలుళ్లు జరిగి ఉండొచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ పేలుళ్లు జరిగాయని.. కచ్చితంగా కుట్రపూరిత చర్యగానే సిరియా భద్రతా అధికారులు భావిస్తున్నారు. ఒక వాహనం కూడా ఈ పేలుళ్ల ధాటికి రేగిన మంటల్లో తగలబడింది.
Two explosions rocked the area near the Four Seasons Hotel in Damascus on Tuesday, where French President Emmanuel Macron is staying during his official visit to Syria, according to Al Arabiya.
— Report News Agency (@reportaznews) July 7, 2026
Macron's motorcade reportedly left the hotel shortly before the blasts and headed to… pic.twitter.com/zKcNS1xc8K
సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో దైపాక్షిక చర్చల నిమిత్తం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సిరియా పర్యటనకు వెళ్లారు. అయితే.. సిరియా అధ్యక్షుడితో షెడ్యూల్ ప్రకారమే మాక్రాన్ పర్యటన సాగిందని.. అధ్యక్ష భవనం దగ్గర ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు, అవాంఛనీయ ఘటనలు జరగలేదని సిరియా ప్రభుత్వం తెలిపింది.
అయితే.. ఈ పేలుళ్లు జరిగిన రోడ్లను ముందు జాగ్రత్త చర్యగా అధికారులు మూసివేయించారు. ఈ పేలుళ్ల వెనుక ఎవరి హస్తం ఉందనే విషయంలో దర్యాప్తు చేస్తున్నారు. గత వారం డమాస్కస్ నగరంలోని ఒక కేఫ్‌లో పేలుడు జరిగి తొమ్మిది మంది చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు.
