కామారెడ్డి: విదేశీ ఉద్యోగాల పేరిట మోసం.. వ్యక్తి అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కామారెడ్డి: విదేశీ ఉద్యోగాల పేరిట మోసం.. వ్యక్తి అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కామారెడ్డి, వెలుగు: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో  యువకులను మోసగించిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీసులు సోమవారం అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాకు వివరించారు. రష్యాలో వర్క్​పర్మిట్​వీసాలు ఇప్పిస్తామని నమ్మించి  కొద్ది రోజుల కింద తనతో పాటు తన ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మోసగించాడని మైసమ్మ చెరువు తండాకు చెందిన భూక్య నరేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులకు నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన గలేటి వెంకటయ్యపై ఫిర్యాదు చేశాడు. వీసా ప్రాసెసింగ్​పేరుతో తమ దగ్గర రూ.9.37 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేరకొన్నాడు. 

ఈ నేపథ్యంలో సోమవారం గలేటి వెంకటయ్య అలియాస్​ వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినట్లు డీఎస్పీ తెలిపారు.  ఇతని నుంచి రూ. 45వేల నగదు,  బాధితులకు చెందిన 3 పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులు, మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్,  బైక్​ స్వాధీనం చేసుకున్నామన్నారు. రూరల్ సీఐ శ్రీధర్​, ఎస్సై అనిల్​ ఆధ్వర్యంలో కేసు ఎంక్వైరీ చేసి నిందితుడిని అరెస్టు చేశామన్నారు.