ఆర్మూర్: ఈ నెల 9 నుంచి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న జూనియర్ బాయ్స్ అంతర్ జిల్లాల హాకీ టోర్నీలో పాల్గొనే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా జట్టును సోమవారం ఆర్మూర్‌లో ఎంపిక చేశారు.
ఆర్మూర్ టౌన్‌లోని మినీ స్టేడియంలో ఎంపిక పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన 18 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ గోనె లహరి, జిల్లా హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణ క్రీడాకారులను అభినందించారు.
