దోస్త్ మేరా దోస్త్.. డీసీపీ వైభవ్ గైక్వాడ్, బాపు సాహెబ్ గైక్వాడ్ వీడియో వైరల్

దోస్త్ మేరా దోస్త్.. డీసీపీ వైభవ్ గైక్వాడ్, బాపు సాహెబ్ గైక్వాడ్ వీడియో వైరల్

హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, 2025 ఐపీఎస్ బ్యాచ్‌ ఆఫీసర్​ బాపు సాహెబ్ గైక్వాడ్ స్నేహం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల వైభవ్ గైక్వాడ్ ఆఫీసుకు వచ్చిన బాపుసాహెబ్ గైక్వాడ్ వైభవ్తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాలేజీ రోజుల్లో ప్రారంభమైన తమ స్నేహం ఇప్పుడూ కొనసాగుతోందన్నారు. కొన్ని స్నేహాలు కాలం చేత రాయబడితే, మరికొన్ని విధి చేత రాయబడతాయని భావోద్వేగానికి గురయ్యారు.

మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​ జిల్లాలో ఓ పేద కుటుంబానికి చెందిన బాపుసాహెబ్ గైక్వాడ్ కష్టపడి ఐపీఎస్ ​సాధించారు. తల్లి ఇండ్లల్లో పని చేసేది. తండ్రి వాచ్​మెన్. బాపుసాహెబ్ కూడా తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడానికి టిఫిన్ డెలివరీ బాయ్‌గా పని చేశారు. ఐపీఎస్​ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎల్అండ్​టీలో, సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా ఎంపికైనా యూపీఎస్సీకి ప్రిపేర్ అయి 2025లో 561వ ర్యాంకు సాధించారు.

బషీర్‌బాగ్, వెలుగు