బాసర, వెలుగు: నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఆలయ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పాత నిర్మాణాలను తొలగించే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని పాత రాజగోపురాన్ని సోమవారం కూల్చివేశారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయాన్ని విశాలంగా, ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దే లక్ష్యంతో పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నిర్మాణ పనులను వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేయలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. పనుల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
