శ్రీలంక జైలులో ఘర్షణల్లో మృతులు 25 మంది

శ్రీలంక జైలులో ఘర్షణల్లో మృతులు 25 మంది

కొలంబో: శ్రీలంకలోని నెగొంబో జైలులో చోటుచేసుకున్న ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 25 కు పెరిగింది. ఇందులో నలుగురు జైలు సిబ్బంది కూడా ఉన్నారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. జైలు లోపల డ్రగ్స్ అక్రమ రవాణాను సమర్థించే ఒక వర్గానికి, దానిని వ్యతిరేకించే మరో వర్గానికి మధ్య ఆదివారం ఘర్షణ మొదలైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
 
సోమవారానికి ఈ అల్లర్లు ఉద్రిక్తంగా మారాయి. తిరుగుబాటు చేసిన ఖైదీలు.. సిబ్బంది నుంచి తుపాకులను లాక్కొని కాల్పులు జరపడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. దీంతో జైలు అధికారులు, పోలీసులు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది.