వచ్చే ఆదివారం నుంచి ఉబర్, ర్యాపిడో, ఓలా ఆటోలు బంద్

వచ్చే ఆదివారం నుంచి ఉబర్, ర్యాపిడో, ఓలా ఆటోలు బంద్

హైదరాబాద్: తెలంగాణ క్యాబ్, వ్యాన్ డ్రైవర్ల సమస్యల పరిష్కరానికై... తెలంగాణ రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 23న అర్ధరాత్రి నుంచి నిరవధిక ఆటో బంద్కు వెళ్లనున్నట్లు... బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ నాయకులు ప్రకటించారు.

ఆర్టీసీ ద్వారా ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్న ఈవీ ఆటోల నిర్ణయాన్ని... రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని... జేఏసీ నాయకులు కోరారు. ప్రైవేటు రవాణా కార్మికుల సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని... పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఫ్యూయల్ ధరలకు అనుగుణంగా ఆటో, క్యాబ్ మీటర్ రేట్లను సవరించి... బ్రతకడానికి కనీస ఆదాయం ఇవ్వాలని పేర్కొన్నారు.

ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో ఉపాధి కోల్పోయి... ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల్ కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించాలన్నారు. తమ 14 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచినట్లు వెల్లడించారు.

గతంలో సమ్మె సందర్భంగా.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నెరవేరస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. నెలలు గడుస్తున్నా హామీలు నెరవేర్చకుండా మంత్రి మోసం చేశారని మండిపడ్డారు. మంత్రి ఇచ్చిన నమ్మద్రోహనికి నిరసనగా మళ్లీ సమ్మెకు సిద్దమవుతున్నట్లు... జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.