పద్మారావు నగర్: ఫుడ్ ఆలస్యమైందని జొమాటో బాయ్‌‌‌‌ పై దాడి

పద్మారావు నగర్: ఫుడ్ ఆలస్యమైందని జొమాటో బాయ్‌‌‌‌ పై దాడి

పద్మారావునగర్, వెలుగు: ఫుడ్​ డెలివరీ ఆలస్యమైందన్న కోపంతో ఓ డెలివరీ బాయ్‌‌‌‌పై భార్యాభర్తలు దాడి చేశారు. కార్ఖానా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంటోన్మెంట్‌‌‌‌ పరిధిలోని వాసవి నగర్‌‌‌‌ రాక్‌‌‌‌వెల్‌‌‌‌ అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో నివాసముంటున్న దంపతులు జొమాటోలో ఫుడ్​ ఆర్డర్‌‌‌‌ చేశారు. అయితే ఆర్డర్‌‌‌‌ సకాలంలో రాలేదంటూ డెలివరీ బాయ్‌‌‌‌ ఆశిష్‌‌‌‌తో సదరు దంపతులు వాగ్వాదానికి దిగారు. 

లొకేషన్‌‌‌‌ సరిగా చూపించకపోవడం వల్లే రావడం ఆలస్యమైందని ఆశిష్‌‌‌‌ నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు శాంతించలేదు. ఆగ్రహంతో ఊగిపోయిన భార్యాభర్తలు అతడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆశిష్‌‌‌‌ కార్ఖానా పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేశాడు. మరోవైపు సదరు దంపతులు కూడా డెలివరీ బాయ్‌‌‌‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.