సోమాలియాలో రెండు నౌకలు హైజాక్.. బందీలుగా ఆరుగురు భారతీయ నావికులు

సోమాలియాలో రెండు నౌకలు హైజాక్.. బందీలుగా ఆరుగురు భారతీయ నావికులు

సోమాలియా తీరంలో సముద్ర దొంగలు మళ్లీరెచ్చిపోయారు. గడిచిన నాలుగు రోజుల్లో రెండు నౌకలను హైజాక్ చేశారు.సోమాలియాలోని ఫుంట్ లాండ్ తీరంలోకామెరున్ జెండాతో ఉన్న నౌకను సముద్ర దొంగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నౌక టర్కీ నుంచి మొగాడిషులోని సైనిక శిక్షణ కేంద్రానికి ఆయుధాలు, పరికరాలు తీసుకెళ్తుండగా దొంగలు తమ అధీనంలోకి తీసుకున్నారు. హైజాక్ సమయంలో నౌకలో మొత్తం 10మంది సిబ్బంది ఉండగా.. వారిలో ఆరుగులు భారీతీయ నావికులు ఉన్నట్లు సోమాలియా అధికారులు చెబుతున్నారు.  

సోమాలియా సముద్రపు దొంగలు నాలుగు రోజుల్లో రెండు నౌకలను హైజాక్ చేయడంతో అంతర్జాతయంగా ఆందోళన పెరుగుతోంది. సోమాలియా, యెమెన్ తీర ప్రాంతాల్లో సముద్రపు దొంగతనాలు మళ్లీ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. తాజాగా సోమాలియాలోని పుంట్‌లాండ్ తీరంలో కామెరూన్ జెండాతో ఉన్న ఎం/వి లుటుఫ్ నౌకను దొంగలు హైజాక్ చేశారు.  ఈ నౌక మొగాడిషులోని సైనిక శిక్షణ కేంద్రానికి టర్కీ నుంచి ఆయుధాలు, పరికరాలు తీసుకెళ్తున్నట్లు సమాచారం. నౌకలో మొత్తం 10 మంది సిబ్బంది ఉండగా, వారిలో ఆరుగురు భారతీయులు ఉన్నారు. ఎనిమిది మంది దొంగలు నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు యెమెన్ తీరంలో ఎరిట్రియా జెండాతో ఉన్న సిబు 1 ట్యాంకర్‌ను కూడా హైజాక్ చేశారు. ఈ రెండు నౌకలతో కలిపి ప్రస్తుతం ఆరు నౌకలు సముద్రపు దొంగల చేతిలో ఉన్నాయని సోమాలియా అధికారులు తెలిపారు. వీటిలో 100 మందికి పైగా సిబ్బంది బందీలుగా ఉన్నారు.ప్రాంతీయ ఘర్షణలు, మత్స్యకారుల ఆర్థిక ఇబ్బందులు, సముద్ర భద్రత తగ్గడం వల్ల దాడులు మళ్లీ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.