క్రికెట్‌లో ఫుట్‌బాల్ ఆడటం ఏంట్రా బాబు.. పాక్ ఫీల్డింగ్‌పై నెట్టింట ట్రోలింగ్!

క్రికెట్‌లో ఫుట్‌బాల్ ఆడటం ఏంట్రా బాబు.. పాక్ ఫీల్డింగ్‌పై నెట్టింట ట్రోలింగ్!

Pakistan Fielding: ఇంగ్లాండ్‌తో హెడింగ్లీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ ఆటగాళ్లు బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ విపరీతంగా తడబడుతున్నారు. మ్యాచ్‌ సందర్భంగా బౌండరీ వైపు వేగంగా దూసుకెళ్తున్న బంతిని ఓ పాక్ ఫీల్డర్ చేతులతో ఆపాల్సింది పోయి, ఫుట్‌బాల్ ప్లేయర్‌లా కాళ్లతో ఆపేందుకు విచిత్రంగా ప్రయత్నించాడు. తీరా బంతి అతన్ని దాటుకుని బౌండరీ లైన్ తాకడంతో ఈ కామెడీ క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

FIFA వరల్డ్ కప్‌కి ప్రిపేర్ అవుతున్నారా?: 

ఈ విచిత్రమైన ఫీల్డింగ్ విన్యాసం చూసిన నెటిజన్లు, క్రికెట్ ప్రేమికులు పాకిస్థాన్ టీమ్‌పై మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. క్రికెట్ మ్యాచ్‌లో ఫుట్‌బాల్ ఆడే ఏకైక జట్టు పాక్ మాత్రమే అనే ట్యాగ్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. పాక్ ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్‌కి కాకుండా రాబోయే ఫిఫా వరల్డ్ కప్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు, అది పర్ఫెక్ట్ ఫుట్‌బాల్ టాకిల్.. కాకపోతే బంతి బౌండరీకి వెళ్ళిపోయిందంటూ వ్యంగ్య కామెంట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. 

క్యాచ్‌లు వదిలేస్తూ.. మ్యాచ్‌ను చేజార్చుకుంటూ: 

హెడింగ్లీ టెస్టులో పాకిస్థాన్ మ్యాచ్‌పై పట్టు సాధించకపోవడానికి వారి దారుణమైన ఫీల్డింగ్ ప్రమాణాలు కూడా ఒక ముఖ్య కారణం.. ఈ ఒక్క ఫుట్‌బాల్ ఘటనే కాకుండా వరుస మిస్‌ఫీల్డింగ్‌లు, సులువైన క్యాచ్‌లను నేలపాలు చేయడం ద్వారా పాక్ బౌలర్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లోనే తక్కువ స్కోరుకే ఆలౌట్ అయిన పాకిస్థాన్, మైదానంలో ఇలాంటి తప్పులు చేస్తుండటంతో ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్‌లో కంప్లీట్ అప్పర్ హ్యాండ్ సాధించింది.

కంబ్యాక్ ఇవ్వాలంటే ఫీల్డింగ్ మారాల్సిందే: 

ప్రస్తుతం మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు విజయం దిశగా దూసుకెళ్తోంది. పాకిస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లో కంబ్యాక్ ఇవ్వాలంటే బౌలింగ్, బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ చేస్తేనే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది. అయితే మైదానంలో పాక్ ప్లేయర్స్ ప్రదర్శించిన ఈ ఫుట్‌బాల్ స్టంట్స్ మాత్రం ప్రస్తుతానికి సోషల్ మీడియాలో నెటిజన్లకు బిగ్గెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారింది.