నేరడిగొండ, వెలుగు: ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే సూచించారు. ఇచ్చోడ మండలం ఇస్లాంపురలో గురువారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. 150 మంది పోలీసులు తెల్లవారుజాము నుంచి విస్తృత తనిఖీలు చేపట్టారు. 110 బైక్లు, 4 కార్లు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ నెంబర్ ప్లేట్లు అమర్చిన 15 బైక్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఏఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి తాగడం, నిల్వ, రవాణా, అమ్మడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాలనీ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఇంద్రవర్ధన్, సీఐలు సీహెచ్ రమేశ్, నరేశ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు వెంకటి, మురళి, చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
