మంత్రి వివేక్, ఎంపీ వంశీని కలిసిన మంచిర్యాల లీడర్లు

మంత్రి వివేక్, ఎంపీ వంశీని కలిసిన మంచిర్యాల లీడర్లు

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను గురువారం రాత్రి మంచిర్యాల జిల్లాకు చెందిన కాంగ్రెస్​ప్రజాప్రతినిధులు, లీడర్లు కలిశారు. మంతెన జగన్​మోహన్​రావు ఆధ్వర్యంలో మంచిర్యాల కార్పొరేటర్లు, లక్సెట్టిపేట మున్సిపల్​కౌన్సిలర్లు, దండేపల్లి మండల సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు హైదరాబాద్​లోని మినిస్టర్​క్వార్టర్​లో మంత్రి, ఎంపీని కలిశారు. మంచిర్యాల కార్పొరేషన్​పరిధిలోని 47, 26వ వార్డుల కార్పొరేటర్లు​వెంకటసాయికృష్ణ, ఇరుగదిండ్ల రవితోపాటు 36వ కార్పొరేటర్​రాణి భర్త, మాజీ కౌన్సిలర్​అగల్​డ్యూటీ రాజు, పలు డివిజన్లకు చెందిన లీడర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 

లక్సెట్టిపేటలోని 7, 9, 13వ వార్డుల కౌన్సిలర్లు బోడ రాజు, ఒడ్డెపల్లి రాజలింగు, బిరుదుల సత్యనారాయణతోపాటు సీనియర్​లీడర్​రజింత్​సింగ్, దండేపల్లి మండల మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, మాజీ వైస్​ఎంపీపీ ఆకుల రాజేందర్, తాళ్లపేట, రాజుగూడ సర్పంచులు కళావతి, జయనేని రాజవ్వ, ఉప సర్పంచులు పుట్టపాక తిరుపతి, ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ బొడ్డు కమాలకర్, మాజీ సర్పంచ్ అంబాడిపల్లి రవి, నెల్కి సుభాష్, నలిమెల అశోక్​తదితరులు కలిశారు. మంచిర్యాల మాజీ మున్సిపల్ చైర్మన్​ఉప్పలయ్య, దమ్మాల సునీల్​తదితరులు పాల్గొన్నారు.