కొత్తూరు పోలీసులపై రాళ్ల దాడి..మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన

కొత్తూరు పోలీసులపై రాళ్ల దాడి..మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన

షాద్ నగర్, వెలుగు: కొత్తూరు మండల పరిధిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన బొగ్గుల సాయి గౌడ్ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయలేదని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం కొత్తూరు పోలీస్‌స్టేషన్ ముట్టడికి యత్నించారు.  పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. 

ప్రమాదానికి కారణమైన వ్యక్తి మైనర్ అని, బాలానగర్​మండలానికి చెందిన ఓ మాజీ ఎంపీపీ కుమారుడు కావడం వల్లే పోలీసులు ఎఫ్ఐఆర్​లో పేరు చేర్చకుండా రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.