జ్యోతిష్యం: సింహరాశిలోకి మూడు గ్రహాలు..ఐదు రాశుల వారు ఈ మార్పులు ఊహించి ఉండరు..!

జ్యోతిష్యం: సింహరాశిలోకి మూడు గ్రహాలు..ఐదు రాశుల వారు ఈ మార్పులు ఊహించి ఉండరు..!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికలతో కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది.  ప్రస్తుతం సింహ రాశిలో కేతువు.. సూర్యుడు కలిసి సంచరిస్తున్నారు.  వీటికి తోడుగా అదే రాశిలోకి బుధ గ్రహం ఆగస్టు 22 వ తేది రాబోతుంది వచ్చింది.  ఈ మూడు గ్రహాలు కలిసి సంచరించడంంతో ఐదు రాశుల వారికి అదృష్టం తలుపుతుడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం..! 

జ్యోతిష్య శాస్తప్రకారం కేతువు, సూర్యుడు, బుధుడు కలిసి ఒకేరాశిలో సంచరించినప్పుడు త్రిగ్రాహియోగం ఏర్పడుతుంది. లాటరీ లేదా జాక్ పాట్ కొట్టడం, షేర్లు, స్పెక్యులేషన్లు కనక వర్షం కురిపించడం వంటివి జరుగుతాయి. మేష, సింహ, తుల, వృశ్చిక,మకర రాశులవారు అపార ధన లాభం పొందే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

మేష రాశి : సింహరాశిలో మూడు గ్రహాలు కలయిక వలన  ఏ పని తలపెట్టినా ఇబ్బంది లేకుండా  పూర్తవుతుంది.  కష్టానికి తగిన ఫలితం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.  ఆఫీసర్ల మద్దతు పుష్కలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీత భత్యాలు బాగా పెరుగుతాయి.సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారని  పండితులు చెబుతున్నారు. 

సింహ రాశి : ఇదే రాశిలో కేతువు, బుధుడు, సూర్యుడు కలిసి  త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావంతో  ఈ రాశి ఉద్యోగులకు కొత్త బాద్యతలు వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల సహకారంతో ముఖ్యమైన పనులను సజావుగా పూర్తి చేయడం సాధ్యమవుతుంది. ధైర్యంతో నిర్ణయాలు తీసుకునే మీ లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది.  రాబోయే రోజుల్లో వృత్తిపరమైన పురోగతికి మంచి అవకాశాలను కల్పించవచ్చు. . కస్మిక ధన లాభాలు కలుగుతాయి.ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి.అప్పుల సమస్యల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది.  సొంతింటిని ఏర్పరచుకొనేందుకు ప్లాన్​ వేస్తారు.  ఈ రాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.

తులా రాశి :  సింహరాశిలో  త్రిగ్రాహి యోగం వలన ఈ రాశి వారు శక్తి  సామర్థ్యాలు నిరూపించుకోవడానికి  మంచి సమయమని పండితులు చెబుతున్నారు.  జీవిత భాగస్వామికి  ఆకస్మిక ధన లాభం వస్తుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది.వృత్తి పరంగా లైఫ్​ లో సక్సెస్​ సాధిస్తారు. కెరీర్​ లక్ష్యాలను సాధించడంలో సఫలీకృతులవుతారని పండితులు చెబుతున్నారు. అనుకోకుండా పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ తో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది.  ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు.ఇల్లు, భూములకు సంబంధించిన వివాదాలు, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.

వృశ్చిక రాశి :  సింహరాశిలో  త్రిగ్రాహి యోగం  ఈ రాశి వారు జీవితంలో స్థిరత్వం పొందే అవకాశం ఉంది.  ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.  వృత్తి పరంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి.  ఏ పని చేసినా కలసి వస్తుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బాకీలు అనుకోకుండా వసూలవుతాయి.  మానసిక ప్రశాంతత లభిస్తుంది.  ఉద్యోగస్తులు కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తారు.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

మకర రాశి: సింహరాశిలో త్రిగ్రాహి యోగం వలన ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు రెట్టింపవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.  ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. .  ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.  మూడు గ్రహాల అనుకూల స్థితి వలన ఈ రాశి వారికి ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి. జాయింట్ వ్యాపారాలు కలసివస్తాయి.  ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభిస్తుంది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన సంబంధం కుదురుతుంది. చేతి వృత్తుల వారికి అధికంగా ఆర్డర్లు రావడంతో కష్టాలు తీరతాయని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.