మంచిర్యాలలో ‘కాకా’ విగ్రహావిష్కరణ ..సంబరాల్లో మునిగిన కాకా అభిమానులు

మంచిర్యాలలో ‘కాకా’ విగ్రహావిష్కరణ ..సంబరాల్లో మునిగిన కాకా అభిమానులు
  • ఎట్టకేలకు తొలగిన ముసుగు 
  • విగ్రహాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ లీడర్ జగన్మోహన్​రావు

కోల్​బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) విగ్రహాన్ని ఎట్టకేలకు ఆవిష్కరించారు. పదేండ్ల కింద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా పలు కారణాల వల్ల ఆవిష్కరణకు నోచుకోలేదు. కాగా, గురువారం కాంగ్రెస్​లీడర్​మంతెన జగన్మోహన్ రావు, మున్సిపల్ మాజీ​చైర్ పర్సన్​ఉప్పలయ్యతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు రైల్వేస్టేషన్ ​సమీపంలోని కాకా విగ్రహం వద్దకు చేరుకొని ముసుగును తొలగించారు. 

విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాల వేసి నివాళులర్పించారు. కొన్నేండ్లుగా ముసుగు కప్పి ఉంచిన విగ్రహాన్ని ఎట్టకేలకు ఆవిష్కరించడంతో స్థానిక కాంగ్రెస్​నేతలు, కాకా అభిమానులు సంబురాలు చేసుకున్నారు. కాంగ్రెస్​పార్టీ, కాకా వెంకటస్వామి, సీఎం రేవంత్​రెడ్డి జిందాబాద్​అంటూ కార్యకర్తల నినాదాలతో రైల్వే స్టేషన్​పరిసరాలు మార్మోగాయి. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్​అగల్​డ్యూటీ రాజు, స్థానిక లీడర్లు పాల్గొన్నారు.