భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించేందుకు NSE సిద్ధమవుతోంది. ట్రేడింగ్ వాల్యూమ్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద డెరివటివ్స్ ఎక్స్ఛేంజ్‌గా ఉన్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ తన మెగా ఐపీఓ ద్వారా రూ.5లక్షల 26వేల కోట్ల వాల్యుయేషన్‌ను టార్గెట్ చేసింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా తన షేర్లను ఒక్కోటి రూ.2వేల నుంచి రూ. 2వేల 100 ధర ప్రైస్ బ్యాండ్‌కి అమ్మెుచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ఐపీఓ కోసం ఎన్ఎస్ఈ ఇప్పటికే గ్లోబల్ రోడ్‌షోను విజయవంతంగా నిర్వహించింది. బోస్టన్, న్యూయార్క్, లండన్, సింగపూర్, హాంకాంగ్ వంటి ప్రముఖ నగరాల్లో బ్లాక్‌రాక్, క్యాపిటల్ గ్రూప్, జీక్యూజీ పార్టనర్స్ వంటి సుమారు 120 మందికి పైగా దిగ్గజ గ్లోబల్ ఇన్వెస్టర్లతో సమావేశాలు నిర్వహించింది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో ఈ రోడ్‌షో చివరి దశకు చేరుకుంది. దీంతో త్వరలోనే ఐపీఓకు సర్వం సిద్ధం చేస్తోంది ఎక్స్ఛేంజీ.
SBI క్యాపిటల్ మార్కెట్స్ చేరికతో వాటాలు అమ్ముకునే వారి లిస్టులో మార్పులు జరగడంతో.. మార్గెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ ఆమోద ప్రక్రియ కొద్దిగా ఆలస్యమైంది. రూల్స్ ప్రకారం పబ్లిక్ ఫీడ్‌బ్యాక్ కోసం 21 రోజుల సమయం అవసరం కావడంతో.. ఈ భారీ ఐపీఓ సెప్టెంబర్ 15 తర్వాత లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఐపీఓలో 6% వాటా విక్రయం ద్వారా ఎన్ఎస్ఈ సుమారు రూ.31వేల 500 కోట్లను సమీకరించాలని చూస్తోంది. ఇది గతంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా రికార్డుగా ఉన్న రూ. 27వేల 870 కోట్ల ఐపీఓ కంటే ఎక్కువ. అదే జరిగితే ఎన్ఎస్ఈది దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా చరిత్రకెక్కనుంది.
ALSO READ : నెట్‌ఫ్లిక్స్‌కు చెక్ పెట్టేందుకు యూట్యూబ్ మాస్టర్ ప్లాన్
ఈ సక్సెస్‌తో ఎన్ఎస్ఈ గ్లోబల్ మార్కెట్‌లోనూ సరికొత్త మైలురాయిని అందుకోనుంది. ప్రపంచ మార్కెట్ విలువలో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ వెనుకంజలో, నాస్‌డాక్ సరసన 6వ స్థానంలో నిలవనుంది. దేశీయ ఫైనాన్షియల్ మార్కెట్‌లో అతిపెద్ద ఈ ఈవెంట్ కోసం ఇన్వెస్టర్లు చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి ఐపీఓ ఎలాంటి స్పందనను చూస్తుందో, ఎంత వరకూ నిపుణుల అంచనాలను అందుకుని సక్సెస్ అవుతుంది అన్నది.
