Manav Suthar: శ్రీలంకతో గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత యంగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ తన డెడ్లీ బౌలింగ్‌తో నెక్స్ట్ లెవెల్ డామినేషన్ చూపించాడు. కేవలం తన రెండో టెస్ట్ సిరీస్ లోనే సెకండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు, మ్యాచ్ మొత్తం మీద 10 వికెట్ల మైండ్ బ్లాకింగ్ ప్రదర్శనతో టీమిండియా 165 పరుగుల భారీ విజయంలో కీ రోల్ పోషించాడు. ఈ జూన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై టెస్ట్ అరంగేట్రం చేసి 5 వికెట్ హాల్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ 24 ఏళ్ల రాజస్థాన్ స్పిన్నర్, ఇప్పుడు లంకను కూడా తిప్పేసి ఇండియా విక్టరీలో రియల్ హీరోగా నిలిచాడు.
IPL కోసం నీ నేచురల్ గేమ్ మార్చుకోవద్దు:
భారత్ 1–0 తేడాతో సిరీస్ లీడ్ సాధించాక, టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ ఛటేశ్వర్ పూజారా యంగ్ స్పిన్నర్ సుతార్‌కు కీలకమైన సలహా ఇచ్చాడు. సుతార్ లాంటి క్వాలిటీ స్పిన్నర్‌ను ఇండియన్ టీమ్ మేనేజ్‌మెంట్ టెస్ట్ క్రికెట్ కోసం జాగ్రత్తగా కాపాడుకోవాలని తెలిపాడు. యంగ్ ప్లేయర్లు ఐపీఎల్ కాంట్రాక్ట్‌ల కోసం ఆరాటపడటం సహజమే, కానీ ఐపీఎల్ లేదా పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం తన సహజసిద్ధమైన ఫ్లైట్ ఇచ్చే బౌలింగ్ శైలిని, యాక్షన్‌ను అస్సలు మార్చుకోవద్దని వ్యాఖ్యానించాడు.
దయచేసి నీ స్ట్రెంత్ మార్చుకోకు:
ఐపీఎల్ ఆడటం తప్పేం కాదని, వైట్ బాల్‌కి తగ్గట్టు కాస్త వేగంగా, ఫ్లాట్‌గా బౌలింగ్ చేయడం సహజమే అని పూజారా పేర్కొన్నాడు. ఆ దారినెళ్లి ఐపీఎల్‌లో సక్సెస్ అయినా మంచిదే, కానీ కేవలం ఐపీఎల్ ఆఫర్ల కోసం నీ అసలైన బలాన్ని రెడ్ బాల్ స్పిన్ కంట్రోల్, బంతిని గాల్లో విసిరే (Flight) నేచురల్ ఎబిలిటీని వదులుకోవద్దన్నాడు. టెస్టుల్లో రాణించడానికి అతనికి ఇప్పుడున్న స్కిల్స్ పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. ఎలాంటి మార్పులు అవసరం లేదని పూజారా క్లారిటీ ఇచ్చాడు.
ALSO READ : సచిన్ కంటే కోహ్లీనే బెస్ట్
గుజరాత్ టైటాన్స్ స్క్వాడ్‌లో సుతార్:
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడి 2 వికెట్లు తీసినప్పటికీ, టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం టీమిండియాకు తిరుగులేని స్పిన్ ఆయుధంగా మారుతున్నాడు. ఛటేశ్వర్ పూజారా ఇచ్చిన ఈ వాల్యూబుల్ అడ్వైస్‌ను ఫాలో అయి మానవ్ సుతార్ టెస్టుల్లో ఇంకెన్ని రికార్డులు కొడతాడో చూద్దాం..
