Virat vs Sachin: గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో టీమిండియా సాధించిన ఘన విజయం తర్వాత విదేశీ గడ్డపై భారత బ్యాటర్ల పర్ఫార్మెన్స్ గురించి సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ (ABD) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విదేశీ టెస్టుల్లో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీనే ఎక్కువ ఇంపాక్ట్ చూపించాడని డివిలియర్స్ కామెంట్ చేయడం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సచిన్ వేసిన బాటలో కోహ్లీ భారత క్రికెట్ స్థాయిని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాడని, నేటి తరం బ్యాటర్లకు ఈ ఇద్దరూ రియల్ రోల్ మోడల్స్ అని ABD తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పష్టం చేశాడు.
ట్రెండ్ సెట్టర్ సచిన్.. రేంజ్ పెంచేసిన కోహ్లీ:
విదేశీ, ముఖ్యంగా పేస్ అండ్ బౌన్స్ ఉండే పిచ్‌లపై ఆసియా బ్యాటర్లు ఆడలేరనే మైండ్‌సెట్‌ను సచిన్ టెండూల్కర్ కంప్లీట్‌గా మార్చేశాడని ఏబీ డివిలియర్స్ కొనియాడాడు. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ (SENA) దేశాల్లో ఉపఖండ బ్యాటర్లు కూడా డామినేట్ చేయగలరని సచిన్ మొదట నిరూపిస్తే, విరాట్ కోహ్లీ దాన్ని మరొక లెవెల్‌కు తీసుకెళ్లాడు. గణాంకాల పరంగా సచిన్ (SENAలో 5,387 రన్స్, 51.30 యావరేజ్) కోహ్లీ (SENAలో 3,661 పరుగులు, 42.08 యావరేజ్) కంటే ముందంజలో ఉన్నప్పటికీ, భారత్ ను ఓవర్సీస్‌లో ఒక అజేయ శక్తిగా మార్చడంలో కోహ్లీ చూపించిన ఇంపాక్టే పీక్స్‌లో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు.
పడిక్కల్ మైండ్ బ్లాకింగ్ షో:
సచిన్, కోహ్లీలు చూపిన బాటలోనే నేటి తరం యంగ్ బ్యాటర్లు దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ విదేశీ గడ్డపై అద్భుత ప్రదర్శన ఇస్తున్నారని ఏబీ డివిలియర్స్ ప్రశంసించాడు. గాలే టెస్టులో దేవదత్ పడిక్కల్ (167) మైండ్ బ్లాకింగ్ సెంచరీతో రాణించగా, కేఎల్ రాహుల్ (82) కూడా బిగ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. కానీ, రాహుల్ టెక్నిక్ పరంగా నెక్స్ట్ లెవెల్ బ్యాటర్ అయినప్పటికీ, విదేశాల్లో అతని బ్యాటింగ్ యావరేజ్ కేవలం 34 మాత్రమే ఉండటం ఆలోచించాల్సిన విషయమని డివిలియర్స్ పాయింట్ అవుట్ చేశాడు.
ALSO READ : మన క్రికెటర్ల రాజ భవనం లాంటి ఇళ్లు
రాహుల్‌కి ABD క్లాస్:
కేఎల్ రాహుల్‌కి ఉన్న టాలెంట్‌కి విదేశాల్లో అతని రికార్డులు ఇంకా బెటర్‌గా ఉండాలని డివిలియర్స్ సూచించాడు. రాహుల్ ఇండియన్ టీమ్‌కి బిగ్ అసెట్, కానీ విదేశీ పిచ్‌లపై కొత్త బంతితో ఎప్పుడైనా డకౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఒకసారి క్రీజులో సెట్ అయితే 100తో సరిపెట్టుకోకుండా దాన్ని 180 లేదా అంతకంటే పెద్ద స్కోరుగా మార్చాలని వెల్లడించాడు. ప్రస్తుతం గాలే టెస్ట్ విక్టరీ వైబ్స్‌లో ఉన్న టీమిండియా, రాబోయే ఓవర్సీస్ టూర్లలోనూ ఇదే రేంజ్ డామినేషన్ చూపిస్తుందో లేదో చూడాలి మరీ.
🚨Virat Kohli was better than Sachin Tendulkar in Tests - AB De Villiers makes massive claim🤯
— Akshat (@Cricketmythos) August 20, 2026
AB De Villiers said :🗣️
"I think of someone like Sachin Tendulkar way back, who started that trend for India. Yet, he wasn't as strong as someone like Virat Kohli, who was even… pic.twitter.com/oNmx4Rl3WE
