Cricketers Luxury Homes: భారత క్రికెట్ దిగ్గజాలు స్టేడియంలో పరుగుల వర్షం కురిపిస్తూ, తమ అద్భుతమైన షాట్లతో కోట్లాది మంది ఫ్యాన్స్ గుండెల్లో చెరగని ముద్ర పడింది. అయితే వారు కేవలం క్రికెట్ పిచ్‌కే పరిమితం కాకుండా, తమ కష్టార్జితం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్లతో బిలియనీర్ల స్థాయికి ఎదిగారు. వారి రాయల్ లైఫ్‌స్టైల్, డ్రీమ్ హౌస్‌లు, విలాసవంతమైన ఆస్తులు నేటి యంగ్ జనరేషన్‌ను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా వారు నిర్మించుకున్న వందల కోట్ల విలువైన విలాసవంతమైన ఇళ్లు, వాటిలో ఉండే నెక్స్ట్ లెవెల్ ఫెసిలిటీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
రాంచీలో ధోనీ 7 ఎకరాల ఫామ్‌హౌస్:
భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి కార్లు, బైక్‌లంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రాంచీలోని తన సొంత ఊరిలో 7 ఎకరాల విశాలమైన స్థలంలో కైలాసపతి పేరుతో ఏకంగా రూ. 100 కోట్లకు పైగా విలువైన డ్రీమ్ ఫామ్‌హౌస్‌ను నిర్మించుకున్నాడు. ఇందులో సూపర్‌బైక్స్, లగ్జరీ కార్ల కోసం ఒక సపరేట్ గ్యారేజ్, జిమ్, స్విమ్మింగ్ పూల్ మెయిన్ అట్రాక్షన్ వంటి సౌకర్యాలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి.
సెహ్వాగ్ రూ. 130 కోట్ల మహల్:
భారత జట్టు డేంజరస్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఢిల్లీలోని హౌజ్ ఖాస్‌లో నిర్మించిన కృష్ణ నివాస్ బంగ్లా విలువ దాదాపు రూ. 130 కోట్లు ఉంటుంది. ఇందులో 12 విశాలమైన గదులు, సొంత గుడి, పెంచుకునే కుక్కల కోసం ప్రత్యేక లాన్‌తో ఈ భవనం రాయల్ స్టాండర్డ్స్‌కు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు.
గురుగ్రామ్‌లో కోహ్లీ రూ. 80 కోట్ల విల్లా:
క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ ఆటలోనే కాదు.. తన లైఫ్‌స్టైల్‌లోనూ ఆల్వేస్ క్లాస్ అని చెప్పాలి. గురుగ్రామ్‌లోని డిఎల్ఎఫ్ సిటీలో రూ. 80 కోట్ల విలువైన విల్లాను కోహ్లీ అత్యంత ట్రెండీగా డిజైన్ చేయించుకున్నాడు. 10,000 చదరపు అడుగుల ఈ మహల్‌లో అత్యాధునిక జిమ్, విలాసవంతమైన ఫర్నిచర్ నెక్స్ట్ లెవెల్ వైబ్స్ ఇస్తాయి.
బాంద్రాలో సచిన్ డ్రీమ్ హౌస్:
మరోవైపు క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ముంబై నగరంలోని బాంద్రాలో గల ఐకానిక్ దోరాబ్ విల్లాలో నివసిస్తున్నారు. 2007లో రూ. 39 కోట్లకు ప్లాట్ కొని, 6,000 చదరపు అడుగుల్లో ఐదంతస్తుల ఐకానిక్ భవనాన్ని నిర్మించుకున్నారు. వర్షాకాలంలో సేదతీరడానికి ఇక్కడ ఉన్న ప్రత్యేక పచ్చని తోట ఈ విల్లాకే హైలైట్.
కోల్‌కతాలో గంగూలీ 50 గదుల ప్యాలెస్:
ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా సౌరవ్ గంగూలీ రాయల్ లుక్‌కి పర్ఫెక్ట్ సూట్ అయ్యేలా కోల్‌కతాలోని లోయర్ రావ్‌డన్ స్ట్రీట్‌లో రూ. 47 కోట్లకు పైగా విలువైన రాజభవనం నిర్మాణం చేసుకున్నాడు. ఏకంగా 50కి పైగా గదులతో పురాతన రాజభవనాన్ని తలపించే ఈ ప్యాలెస్ దాదా రాయల్ స్టాండర్డ్స్‌ని ప్రతిబింబిస్తుంది. క్రికెట్ గ్రౌండ్ లో పరుగుల వర్షం కురిపించిన ఈ క్రికెట్ లెజెండ్స్, రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంలోనూ మైండ్ బ్లాకింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో బిలియనీర్ల తరహా విలాసవంతమైన జీవితాన్ని గడుపడం ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతుంది.
