నెట్‌ఫ్లిక్స్‌కు చెక్ పెట్టేందుకు యూట్యూబ్ మాస్టర్ ప్లాన్: టాప్ క్రియేటర్లకు కోట్ల రూపాయల ఆఫర్లు!

నెట్‌ఫ్లిక్స్‌కు చెక్ పెట్టేందుకు యూట్యూబ్ మాస్టర్ ప్లాన్: టాప్ క్రియేటర్లకు కోట్ల రూపాయల ఆఫర్లు!

YouTube vs Netflix: ప్రపంచవ్యాప్తంగా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సరికొత్త యుద్ధం మొదలౌతోంది. తమ ప్లాట్‌ఫారమ్‌లోని ప్రముఖ కంటెంట్ క్రియేటర్లను కాపాడుకునేందుకు యూట్యూబ్ సంస్థ అసాధారణ నిర్ణయాలు తీసుకుంటోంది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో క్రియేటర్లు చేతులు కలపకుండా నిరోధించడానికి.. యూట్యూబ్ ఏకంగా కోట్ల రూపాయలను ఆఫర్ చేస్తున్నట్లు తాజా రిపోర్ట్స్ బయటపెట్టాయి.  

గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ విజయానికి అసలైన కారణం క్రియేటర్ల నెట్‌వర్కే. కోట్లాది మంది సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉన్న టాప్ ఛానెల్స్ కొన్ని నెట్‌ఫ్లిక్స్ వైపు వెళ్తుండటం యూట్యూబ్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పోటీని తట్టుకునేందుకు యూట్యూబ్ ప్రత్యేక వ్యూహానికి తెరతీసింది. తమ కంటెంట్‌ను కొంతకాలం పాటు కేవలం యూట్యూబ్‌లోనే ఎక్స్‌క్లూజివ్‌గా ఉంచేందుకు అంగీకరించే సెలెక్టెడ్ క్రియేటర్లకు భారీ మొత్తాలను చెల్లించేందుకు చర్చలు జరుపుతోంది. కేవలం వన్‌టైమ్ పేమెంట్ కాకుండా కొత్త ప్రోగ్రామ్‌లకు ఫండింగ్ చేయడం.. బ్రాండ్ పార్ట్‌నర్షిప్‌లలో వాటా ఇవ్వడం వంటి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు చేస్తోంది.

నెట్‌ఫ్లిక్స్ గత కొన్ని నెలలుగా యూట్యూబ్ స్టార్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. అలాన్ చిక్రిన్ చౌ, నిక్ డిజియోవన్నీ వంటి ప్రముఖ క్రియేటర్లు తమ వీడియోలను ఒకే సమయంలో యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ రెండింటిలోనూ విడుదల చేసేలా నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు ఉన్న సుమారు 33 కోట్ల గ్లోబల్ యూజర్ల బేస్ క్రియేటర్లకు అదనపు ఆదాయాన్ని, కొత్త ప్రేక్షకులను తెచ్చిపెడుతుండటంతో కొందరు దీనికి ఆకర్షితులవుతున్నారు. 

►ALSO READ | ఆగస్టు 24 నుంచి కొత్త టెలికాం రూల్స్.. చట్టప్రకారం ఒక్కో వ్యక్తికి ఎన్ని సిమ్ కార్డ్స్ ఉండొచ్చంటే?

వీడియోలను ముందుగానే సబ్మిట్ చేయడం, కొన్ని బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌లను తొలగించడం వంటి నెట్‌ఫ్లిక్స్ నిబంధనలు కొందరికి నచ్చడం లేదు.ఈ పరిణామాలపై యూట్యూబ్ కఠినంగా వ్యవహరిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ఒకే ‌టైమ్‌లో వీడియోలు పోస్ట్ చేసే క్రియేటర్లకు భవిష్యత్తులో యూట్యూబ్ నుంచి దొరికే మార్కెటింగ్ సపోర్ట్, స్పెషల్ ఈవెంట్స్ ఇన్విటేషన్లు తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఏకకాలంలో రెండు ప్లాట్‌ఫారమ్‌లలో వీడియోలు విడుదల చేయడం వల్ల యూట్యూబ్‌లో వ్యూవర్షిప్ దెబ్బతింటుందని భావిస్తోంది.  
ప్రస్తుతానికి ఈ ఒప్పందాలకు సంబంధించి ఎలాంటి తుది నిర్ణయాలు తీసుకోనప్పటికీ.. చర్చలు మాత్రం తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. మెుత్తానికి డిజిటల్ కంటెంట్ రంగంలో యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ మధ్య వార్ క్రియేటర్లకు ఎలాంటి అవకాశాలను తెస్తుంది, ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది వేచి చూడాల్సిందే.