భార్య, భర్త ఇద్దరూ డాక్టర్లే... వేరొకరితో వివాహేతర సంబంధం.. భర్తను చంపేందుకు భార్య ప్లాన్...

భార్య, భర్త ఇద్దరూ డాక్టర్లే... వేరొకరితో వివాహేతర సంబంధం.. భర్తను చంపేందుకు భార్య ప్లాన్...

బరితెగింపు అనాలో, పోయేకాలం అనాలో తెలీదు కానీ.. ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే పెళ్లి మీద నమ్మకం, ఆశ చచ్చిపోతోంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నారని కట్టుకున్నవారిని చంపుతున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. జనగామలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా భర్తతో గొడవ పడి అతడిని చంపేందుకు మర్డర్ ప్లాన్ వేసింది ఓ భార్య. గురువారం ( ఆగస్టు 20 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...

జనగామలోని ప్రీతి కిడ్నీ హాస్పిటల్ లో ప్రీతి, నిశాంత్ ఇద్దరు డాక్టర్లు. వివాహేతర సంబధం విషయంలో ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బండారి శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ప్రీతి. ఈ క్రమంలో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని శ్రీనివాస్ తో కలిసి నిశాంత్ ను చంపేందుకు ప్లాన్ చేసింది ప్రీతి.

ఇవాళ హాస్పిటల్ కి వచ్చి శ్రీనివాస్ డ్రైవర్ నిశాంత్ పై దాడికి దిగాడు. దాడి సమయంలో అడ్డొచ్చిన నిశాంత్ అన్నయ్య, హాస్పిటల్ సిబ్బందిపై కూడా దాడికి తెగబడ్డారు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు నిశాంత్. తనను చంపేందుకు శ్రీనివాస్, ప్రీతి మర్డర్ ప్లాన్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు నిశాంత్. నిశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.