CRPFలో 521 కానిస్టేబులు పోస్టులు.. క్రీడాకారులకు బంపర్ ఆఫర్.. పూర్తి వివరాలు ఇవే!

CRPFలో 521 కానిస్టేబులు పోస్టులు.. క్రీడాకారులకు బంపర్ ఆఫర్.. పూర్తి వివరాలు ఇవే!

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటాలో హెడ్ కానిస్టేబుల్/ జనరల్ డ్యూటీ, కానిస్టేబుల్/ జనరల్ డ్యూటీ (హెచ్‌సీ/జీడీ, సీటీ/జీడీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ అక్టోబర్ 12న ప్రారంభం కానున్నది. నవంబర్ 11వరకు అప్లై చేసుకోవచ్చు.

పోస్టు పేరు: హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)

మొత్తం ఖాళీలు: 521. హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) 182 (మేల్ 150, ఫీమేల్ 32), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) (మేల్ 258, ఫీమేల్ 81).

క్రీడా విభాగాల వారీగా పోస్టుల వివరాలు: అథ్లెటిక్స్ 101, అక్వాటిక్స్ (స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోలో) 60, కబడ్డీ 27, రెజ్లింగ్ (కుస్తీ) 26, ఫుట్‌బాల్ 22, బాక్సింగ్ 20, వాటర్ స్పోర్ట్స్ (కయాకింగ్, కనోయింగ్, రోయింగ్) 20, వుషు 20, వాలీబాల్ 20, వెయిట్‌లిఫ్టింగ్ 19, కరాటే 17, జూడో 16, 
బాస్కెట్‌బాల్ 16, హాకీ 15, తైక్వాండో 14, షూటింగ్ 13, జిమ్నాస్టిక్స్ 12, హ్యాండ్‌బాల్ 12, యోగా (యోగాసన) 12, బాడీ బిల్డింగ్ 11, బ్యాడ్మింటన్ 5,  ఆర్చరీ 3.

విద్యార్హతలు
హెచ్​సీ/ జీడీ (స్పోర్ట్స్ కోటా): గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 + 2 లేదా సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 

సీటీ/ జీడీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పూర్తిచేసి ఉండాలి.

క్రీడా అర్హతలు: అంతర్జాతీయ, జాతీయ పోటీలు, విశ్వవిద్యాలయ టోర్నమెంట్లు, జూనియర్ జాతీయ స్థాయి, పాఠశాల స్థాయి, ఖేలో ఇండియా పోటీల్లో  పతకాలు సాధించి ఉండాలి. 

వయసు: 2026, ఆగస్టు 1 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 12.

లాస్ట్ డేట్: నవంబర్ 11.

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంటేషన్, క్రీడల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా మార్కుల కేటాయింపు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ rect.crpf.gov.inను సందర్శించండి.