కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. తన లేటెస్ట్ సినిమా 'బెయిల్' ( Bail ) ప్రమోషన్స్ లో భాగంగా చిత్రదుర్గలోని బసవేశ్వర థియేటర్ కు వెళ్లగా.. అక్కడ ఊహించిన ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాన్స్ కోలాహలం మధ్య థియేటర్ లోకి ఎంట్రీ ఇస్తుండగా .. కాల్చిన బాణసంచా ఒక్కసారిగా శివరాజ్ కుమార్ కు అత్యంత సమీపంలో పేలింది.
దీంతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిప్పురవ్వలు, పొగ ఆయనపై పడటంతో శివరాజ్‌కుమార్ వెంటనే ముఖాన్ని, తలను చేతులతో కవర్ చేసుకున్నారు. పక్కనే ఉన్న సెక్యూరిటీ టీమ్ అప్రమత్తమై ఆయనకు రక్షణగా నిలిచింది. ఈ భయంకర దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన నిర్వాహకులపై అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
అయితే, ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన శివరాజ్‌కుమార్.. ఏమాత్రం సహనం కోల్పోకుండా అభిమానులను పలకరించి, థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి తన ప్రొఫెషనలిజాన్ని నిరూపించుకున్నారు. గతేడాది అమెరికాలో బ్లాడర్ క్యాన్సర్‌కు శస్త్రచికిత్స చేయించుకుని.. క్యాన్సర్‌ను జయించిమళ్లీ పూర్తి ఫిట్‌నెస్‌తో వెండితెరపై అడుగుపెట్టిన ఆయన గుండెధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం 'బెయిల్' చిత్రంతో థియేటర్లలో సందడి చేస్తున్న శివరాజ్‌కుమార్, దక్షిణాది వ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ యాక్టర్‌గా మారారు. ప్రస్తుతం రజనీకాంత్ 'జైలర్ 2' నటించారు. ఈమూవీ అక్టోబర్ 15న రిలీజ్ కు సిద్దంగా ఉంది. అంతేకాకుండా, ఆయన క్యాన్సర్ పోరాటాన్ని వివరిస్తూ రూపుదిద్దుకుంటున్న 'సర్వైవర్' (Survivor) డాక్యుమెంటరీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
actor shivarajkumar escape Firecracker accident at chitradurga #shivarajkumar #jailer2 #bail #chitradurga #shivanna #chitradurga #KarnatakaNews https://t.co/qxX4kiZ39Q
— Santosh Kumar (@Santhuka820) October 6, 2026
