సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అగ్గిపెట్టె మచ్చ అయలియాస్ కిరణ్ మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు తిరుపతిలోని SVIMS ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్ సపోర్టు తో చికిత్స పొందుతున్న కిరణ్ ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు.
కిరణ్ మృతదేహాన్ని తిరుపతి రూరల్ వైఎస్సార్ కాలనీకి కుటుంబ సభ్యులు తరలించారు. కిరణ్ మరణ వార్త తెలిసి ఆయన అభిమానులు, ఫాలోవర్లు షాక్ కు గురైయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నారు. కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.
'అగ్గిపెట్టె మచ్చ'గా సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చికున్న ఆయన.. తనదైన మాటతీరు, హావభావాలు, విభిన్నమైన శైలితో చేసిన వీడియోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. అలా ఒక్కో వీడియోతో ఆయనకు ఫాలోయింగ్ పెరిగి.. సోషల్ మీడియా ఫేమ్‌గా మారారు. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా.. కిరణ్ పేరు గతంలో పలు సందర్భాల్లో వార్తల్లోనూ నిలిచింది. ఆయనకు సంబంధించిన వీడియోలు, ఘటనలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. కిరణ్.. ఇక లేరన్న మరణ వార్త అభిమానులను కలచివేస్తోంది.
