4 ఏళ్ల తర్వాత భువనేశ్వర్ రీఎంట్రీ.. న్యూజిలాండ్‌తో భారత్ పూర్తి షెడ్యూల్, జట్ల వివరాలు ఇవే!

4 ఏళ్ల తర్వాత భువనేశ్వర్ రీఎంట్రీ.. న్యూజిలాండ్‌తో భారత్ పూర్తి షెడ్యూల్, జట్ల వివరాలు ఇవే!

Bhuvneshwar Kumar: భారత క్రికెట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. త్వరలో జరగనున్న న్యూజిలాండ్ పర్యటన కోసం బీసీసీఐ (BCCI) తాజాగా టీ20, ఇండియా 'ఏ' జట్లను ప్రకటించింది. ఈ టూర్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేశాడు. గౌహతిలోని ఏసీఏ స్టేడియంలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

4 ఏళ్ల తర్వాత భువి రీఎంట్రీ:

36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను నవంబర్ 22వ తేదీ, 2022లో న్యూజిలాండ్‌లోని నాపియర్ వేదికగా ఆడాడు. ఆసక్తికరంగా.. ఇప్పుడు అదే ప్రత్యర్థి, అదే గడ్డపై ప్రారంభంకానున్న సిరీస్‌తో ఆయన తన రీఎంట్రీ చేయబోతున్నాడు. తాత్కాలిక సెలక్షన్ కమిటీ హెడ్ ప్రజ్ఞాన్ ఓజా, కార్యదర్శి దేవజిత్ సైకియా ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్ లో జట్టు కూర్పును ఫైనల్ చేశారు. పవర్‌ప్లే ఓవర్లలో బంతిని చక్కగా స్వింగ్ చేయగల భువీ అనుభవం కివీస్ గడ్డపై టీమిండియాకు ఎంతో హెల్ప్ చేయనుంది. 

న్యూజిలాంట్ టూర్ షెడ్యూల్: 

* అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఈ 40 రోజుల సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటన.. ఆ దేశంలోనే అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్‌లలో ఒకటిగా నిలవనుంది.

* టీ20 సిరీస్: అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్‌లో తొలి టీ20తో ప్రారంభమై, వెల్లింగ్టన్, ఆక్లాండ్, హమిల్టన్ వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.

* వన్డే సిరీస్: నవంబర్ 4 నుంచి వన్డే మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.

* టెస్ట్ సిరీస్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో అత్యంత కీలకమైన టెస్ట్ మ్యాచ్‌లు నవంబర్ 19-23 (వెల్లింగ్టన్), నవంబర్ 27-డిసెంబర్ 1 (క్రైస్ట్‌చర్చ్) తేదీల్లో జరగనున్నాయి. కాగా, 2019 తర్వాత భారత్ న్యూజిలాండ్‌లో టెస్ట్ సిరీస్ ఆడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

భారత టీ20 జట్టు:

శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్.

ఇండియా 'ఏ' జట్టు:

న్యూజిలాండ్ 'ఏ'తో అక్టోబర్ 24 నుంచి ప్రారంభమయ్యే మల్టీడే (multi-day) మ్యాచ్‌ల కోసం 15 మందితో కూడిన భారత్ 'ఏ' జట్టును బీసీసీఐ ప్రకటించింది. 

స్క్వాడ్: ధ్రువ్ జురెల్ (కెప్టెన్ & వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ స్మరణ్, రిషబ్ పంత్* (వికెట్ కీపర్ - ఫిట్‌నెస్ నిబంధనలకు లోబడి), వాషింగ్టన్ సుందర్, ఆక్విబ్ నబీ, ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్, మానవ్ సుతార్, ముకేష్ చౌదరి, సాయి సుదర్శన్, యశ్ రాథోడ్, ముకేష్ కుమార్.