జ్యోతిష్యం: ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదంలోకి గురుడు... ఆరు రాశుల వారికి సిరుల పంట..!

జ్యోతిష్యం: ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదంలోకి గురుడు...  ఆరు రాశుల వారికి సిరుల పంట..!

జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల్లో కీలకమైన గురుడు  సంచారానికి  కీలక పాత్ర ఉంటుంది. జ్ఞానానికి , సంపదకు, పెళ్లికి, సంతానం, అదృష్టం విషయాల్లో గురుడు కీలక పాత్ర పోషిస్తాడు. ప్రస్తుతం కర్కాటకరాశిలో సంచరిస్తున్న గురుడు... అక్టోబర్​ 8 వ తేదీన రాత్రి 8గంటల 9 నిమిషాలకు ఆశ్లేషా నక్షత్రం నాలుగోపాదంలోకి ప్రవేశిస్తాడు.  దీని ప్రభావం వలన ఆరు రాశుల వారికి అన్ని విధాలా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురుడు సరైన స్థానంలో ఉంటాడో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అంటారు. ఇక నవ గ్రహాల్లో గురు సంచారానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

మేషరాశి:  గురుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించడం వలర ఈ రాశి వారి జీవితం ఆనందమయంగా మారుతుంది.  గురు గ్రహ ప్రభావంతో ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరుతాయి. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగం మారాలి అని చూస్తున్నవారికి ఇది సరైన సమయని పండితులు చెబుతున్నారు. నిరుద్యోగులకు  కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. గతంలో నిలిచిపోయిన వ్యాపార ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయి. 

మిథున రాశి :  గురుడు ఆశ్లేష నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారు  పట్టింది బంగారం అవుతుందని పండితులు చెబుతున్నారు.  అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ధన స్థానంలో గురు ప్రభావం వలన పాత అప్పులు తీరే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.   వ్యాపారంలో ఊహించని విధంగా బంపర్ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో చేసిన పెట్టుబడుల నుండి ఆశించిన దానికంటే రెట్టింపు రాబడిని పొందుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన పాత డబ్బు అకస్మాత్తుగా చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతితో పాటు పెద్ద బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

కర్కాటక రాశి: గురుడు  ఆశ్లేష నక్షత్రంలో సంచారం.. ఇదే రాశిలో గురుడు సంచారం వలన ఈ రాశి వారికి ఆకస్మికంగా ధనలాభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.  కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు.  నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి.ఆత్మవిశ్వాసం, అదృష్టం  పెరుగుతాయి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు,  ప్రభుత్వ పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వ్యాపారం లేదా విద్య కోసం చేసే ప్రయాణాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. 

ధనస్సు రాశి : ఈ రాశి వారికి గురుడు ఆశ్లేష నక్షత్రంలో  చాలా మంచి సమయం అని పండితులు చెబుతున్నారు.  గురుడు రాశ్యాధిపతి కావడంతో  చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా బలపడటం.. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోస్తులకు ప్రమోషన్, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆదాయం నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. ఎక్కువ మార్గాల ద్వారా డబ్బు రావడం వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ బాగా బలపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి బంధం మరింత మధురంగా మారుతుంది. ఒంటరిగా ఉన్నవారి జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి.

కుంభ రాశి :గురుడు ఆశ్లేష నక్షత్రంలో సంచారం వలన  ఈ రాశి వారికి  కష్టాలు తీరిపోయి మంచి రోజులు మొదలవుతాయని పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులకు కొత్త  పెట్టుబడులకు చాలా మంచి సమయమని పండితులు చెబుతున్నారు.. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా వస్తాయి.  వ్యాపారులకు చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారులకు పాత పెట్టుబడులతో మంచి రాబడి లభిస్తుంది. ఉద్యోగస్తులకు  ప్రశంసలు లభిస్తాయి. ఆఫీసులో మీరే కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. పెండింగు పనులు కంప్లీట్​అయ్యే అవకాశాలున్నాయి

మీన రాశి :  ఈ రాశికి అధిపతి గురుడు.. ఆశ్లేష నక్షత్రంలో సంచారవ వలన ఈ రాశి వారికి గోల్డెన్​ పిరియడ్​ ప్రారంభం అయిందని పండితులు చెబుతున్నారు. గురుడు నక్షత్ర మార్పుతో  రాజయోగం పట్టే అవకాశం ఉంది.  సంతానం విషయంలో శుభవార్త వింటారు.  అనుకోకుండా ఇంట్లో శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్య సమస్యలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది.వ్యాపార రంగంలో ఉన్నవారికి విస్తరణ అవకాశాలు లభిస్తాయి. కొత్తగా స్టార్టప్ లేదా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలమైనది. మార్కెట్‌లో మీ బ్రాండ్ వాల్యూ, గుర్తింపు పెరుగుతాయి. పూర్వీకుల ఆస్తి ద్వారా అకస్మాత్తుగా పెద్ద ఎత్తున ఆర్థిక లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. జీవిత భాగస్వామితో చాలా కాలంగా నడుస్తున్న పాత విభేదాలు, మనస్పర్థలు పూర్తిగా తొలగిపోతాయి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.