స్వీటికి ప్రభాస్ గ్రాండ్ హగ్..'స్పిరిట్' సెట్‌లో ప్రత్యక్షమైన దేవసేన, భల్లాలదేవుడు.. రాజమౌళి స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లేనా?

స్వీటికి ప్రభాస్ గ్రాండ్ హగ్..'స్పిరిట్' సెట్‌లో ప్రత్యక్షమైన దేవసేన, భల్లాలదేవుడు.. రాజమౌళి స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లేనా?

రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క శెట్టి , రానా దగ్గుబాటి పేర్లు వింటే చాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన 'బాహుబలి'గుర్తుకొస్తోంది. ఇప్పటికీ ఈ మూవీలోని దృశ్యాలు కళ్లముందు కదులుతుంటాయి.  దర్శకధీరుడు ఎస్.ఎస్ . రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్స్ గా  ఈ త్రిమూర్తులు మారిపోయారు. 

అయితే ఈ ముగ్గురు స్టార్స్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఒకేచోట కలవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'స్పిరిట్' ( Spirit ) షూటింగ్ షెట్ లో అనుష్క, రానా ప్రత్యక్షమయ్యారు.  స్వీటికి బిగ్ హగ్ తో ప్రభాస్ స్వాగతం పలికారు. అయితే ఈ క్రేజీ స్టార్స్ భేటీ వెనుక పెద్ద ప్లానింగ్ ఉందనే వార్తలు సినీ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి.

ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫిక్స్ లో విడుదలైన 'బాహుబలి : ది టార్చ్ బెరర్ ' డాక్యుమెంటరీలో రానా చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. రాజమౌళి శోభు ఇక్కడ లేరు కాబట్టి చెప్తున్నా.. ప్రపంచం సిద్ధంగా ఉందో లేదో నాకు తెలియదు కానీ.. బాహుబలి నుంచి మరిన్ని వండర్స్ రాబోతున్నాయంటూ హింట్ ఇచ్చేశారు. ఆ వెంటనే స్క్రీన్ పై 'లెగసీ కంటిన్యూస్ ' అని పడటం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది.

అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్, దేవసేనగా అనుష్క, భల్లాలదేవుడిగా రానా చూపించిన ప్రతాపం, వారి మధ్య కెమిస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ2,400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఒకవైపు 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' పేరిట 2027, 2028లలో రెండు భాగాల యానిమేషన్ సినిమాలు సిద్ధమవుతుండగా.. ఇప్పుడు ప్రత్యక్షంగా వీరి ముగ్గురి కలయిక చూస్తుంటే.. వెండితెరపై 'బాహుబలి 3' లేదా రాజమౌళి సినిమాటిక్ యూనివర్స్‌లో ఊహించని ధమాకా ఉండబోతుందా? అని సినీప్రముఖులతో పాటు ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.