పుష్పక్ బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 40 శాతం వరకు చార్జీల తగ్గింపు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) గుడ్‌న్యూస్ చెప్పింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడిపిస్తున్న పుష్పక్ ఏసీ బస్సుల చార్జీలను భారీగా తగ్గించింది. తగ్గించిన చార్జీలు అక్టోబర్ 7 నుంచి అమల్లోకి రానున్నాయి.విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులపై భారం తగ్గించే ఉద్దేశంతో పలు ప్రాంతాల నుంచి నడిచే పుష్పక్ బస్సుల చార్జీలను సవరించినట్లు గ్రేటర్ హైదరాబాద్ టీజీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంచూరి శ్రీధర్ తెలిపారు.
ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులకు పుష్పక్ బస్సులు సౌకర్యవంతమైన ఏసీ ప్రయాణాన్ని అందిస్తుండగా, తాజాగా చార్జీలు తగ్గించడంతో మరింత మంది ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు..
మియాపూర్ నుంచి ఎయిర్‌పోర్టుకు తగ్గిన చార్జీలు
మియాపూర్ ప్రాంతం నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే పుష్పక్ బస్సుల్లో చార్జీలను గణనీయంగా తగ్గించారు.
- మియాపూర్ ఎక్స్ రోడ్: రూ.350 నుంచి రూ.250
- జేఎన్‌టీయూ: రూ.350 నుంచి రూ.200
- శిల్పారామం: రూ.300 నుంచి రూ.200
- గచ్చిబౌలి: రూ.300 నుంచి రూ.150
- లింగంపల్లి రూట్‌లోనూ భారీ తగ్గింపు
లింగంపల్లి నుంచి ఎయిర్‌పోర్టుకు
- లింగంపల్లి: రూ.300 నుంచి రూ.200
- ఆల్విన్ ఎక్స్ రోడ్: రూ.350 నుంచి రూ.200
- కొండాపూర్: రూ.300 నుంచి రూ.200
- కొత్తగూడ: రూ.300 నుంచి రూ.150
- గచ్చిబౌలి: రూ.300 నుంచి రూ.150
జేబీఎస్ రూట్‌లోనూ తగ్గిన ధరలు
జేబీఎస్ నుంచి ఎయిర్‌పోర్టుకు నడిచే పుష్పక్ బస్సుల చార్జీల్లోనూ మార్పులు చేశారు.
- జేబీఎస్ నుంచి ఎయిర్‌పోర్ట్: రూ.350 నుంచి రూ.200
- ఎయిర్‌పోర్ట్ నుంచి జేబీఎస్: రూ.400 నుంచి రూ.300
- అంటే ఎయిర్‌పోర్ట్ నుంచి జేబీఎస్‌కు ప్రయాణించే వారికి రూ.100 వరకు ఆదా కానుంది.
పుష్పక్ బస్సులతో పాటు కొన్ని ఇతర మార్గాల్లోనూ
- మందమల్లమ్మ నుంచి జేబీఎస్: రూ.100
- జేబీఎస్ నుంచి మెహిదీపట్నం: రూ.100
- జేబీఎస్ నుంచి ఆరాంఘర్: రూ.100
