Varanasi: మహేష్‌ బాబు 'వారణాసి'లో మ్యూజిక్ మ్యాజిక్.. సాంగ్స్‌పై కీరవాణి క్రేజీ అప్‌డేట్ వైరల్!

Varanasi: మహేష్‌ బాబు 'వారణాసి'లో మ్యూజిక్ మ్యాజిక్.. సాంగ్స్‌పై కీరవాణి క్రేజీ అప్‌డేట్ వైరల్!

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'వారణాసి'పై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీ బడ్జెట్‌, గ్రాండ్ విజువల్స్‌, పాన్‌ ఇండియా తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు ముందే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. లేటెస్ట్ గా ఆస్కార్ విజేత , సంగీత దర్శకుడు ఎం.ఎం .కీరవాణి చెప్పిన కీలక అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌లో ఫుల్‌ జోష్‌ నింపేస్తోంది.

ఇటీవల ఓ కార్యక్రమాంలో మాట్లాడుతూ.. 'వారణాసి'లో ఏకంగా ఆరు పాటలు ఉండబోతున్నాయని కీరవాణి వెల్లడించారు.  రాజమౌళి సినిమాల్లో పాటలు కేవలం వినోదం కోసం కాకుండా కథలో భాగంగా నిలిచేలా ఉంటాయనే విషయం తెలిసిందే. దీంతో 'వారణాసి'లో ఈ ఆరు పాటలు ఎలాంటి మ్యాజిక్‌ చేయబోతున్నాయన్న ఆసక్తి మొదలైంది.

అంతే కాకుండా.. సినిమాకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌పై కూడా కీరవాణి కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. సెప్టెంబర్‌ నుంచి బీజీఎం పనిని ప్రారంభించి, జనవరి నాటికి పూర్తి చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు.. అంటే సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఎంత భారీ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

మహేష్‌బాబు లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్‌ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్‌, మలయాళ స్టార్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్‌, అడ్వెంచర్‌, పురాణాల స్ఫూర్తితో కూడిన భారీ ప్రపంచాన్ని రాజమౌళి తెరపై ఆవిష్కరిస్తున్నారు.. మహేష్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌, రాజమౌళి విజన్‌, కీరవాణి సంగీతం కలిస్తే థియేటర్లలో రికార్డులు ఖాయం అంటూ సినీ వర్గాలు, ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.