ముంబై ఫిల్మ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. రణబీర్ ' రామాయణ' సెట్ పై క్లారిటీ!

ముంబై ఫిల్మ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం.. రణబీర్ ' రామాయణ' సెట్ పై క్లారిటీ!

ముంబైలోని గోరేగామ్ ఫిల్మ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.  ప్రైమ్ ఫోకస్ స్టూడియో వెనుక భాగంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఒక ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్ (PCR) యూనిట్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దీంతో  ఏసీ యూనిట్లు, కెమెరా సామగ్రి, ఎలక్ట్రికల్ వైరింగ్,ఎలక్ట్రికల్ వైరింగ్, షాట్ మెటీరియల్స్  దట్టమైన పొగతో అంటుకుంది. దీంతో అక్కడ పనిచేస్తున్ సిబ్బందితో పాటు స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాయి.   

 సోమవారం ( అక్టోబర్ 5, 2026)  మధ్యాహ్నం 4:02 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'రామాయణం' మూవీ సెట్‌‌లోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రచారం సాగింది. అయితే, దీనిపై 'రామాయణం' మూవీ టీమ్ వెంటనే స్పందిస్తూ.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ప్రమాదం జరిగింది తమ సినిమా సెట్‌లో కాదని స్పష్టత ఇచ్చింది. తమ సమీపంలో ఉన్న ఒక టెంట్ పరిసరాల్లో చిన్నపాటి మంటలు రాగా, చిత్రబృందం తగిన జాగ్రత్తలు తీసుకుందని తెలిపింది..

 

ఈ ప్రమాదం కలర్స్ టీవీ రియాలిటీ షో 'పతి పత్ని ఔర్ పంగా 2', 'ఎంటీవీ హజల్ 5' సెట్ల వెలుపల జరిగిందని ఫెడరేషన్ వర్గాలు వెల్లడించాయి. 'హజల్ 5' గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరుగుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే, సమయానికి ముంబై ఫైర్ బ్రిగేడ్, అంబులెన్స్, స్థానిక పోలీసులు రంగంలోకి దిగి కేవలం 50 నిమిషాల్లో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో కళాకారులకు గానీ, సాంకేతిక నిపుణులకు గానీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరినీ సురక్షితంగా బయటకు తరలించినట్లు నిర్వాహకులు ధృవీకరించారు. బిజీగా ఉండే ఫిల్మ్ సిటీలో తరచూ జరిగే ఇలాంటి ప్రమాదాల దృష్ట్యా నిర్మాతలు మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని సినీ ప్రముఖుల సంఘం FWCE విజ్ఞప్తి చేసింది.