పెళ్లి తర్వాత తొలిసారి లవ్ స్టోరీపై రష్మిక–విజయ్ ఓపెన్.. ఈ 7 సీక్రెట్స్ తెలిస్తే సర్‌ప్రైజ్ అవ్వాల్సిందే!

పెళ్లి తర్వాత తొలిసారి లవ్ స్టోరీపై రష్మిక–విజయ్ ఓపెన్.. ఈ 7 సీక్రెట్స్ తెలిస్తే సర్‌ప్రైజ్ అవ్వాల్సిందే!

టాలీవుడ్‌లో మోస్ట్ లవ్డ్ కపుల్స్‌లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జోడీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చాలా ఏళ్లుగా తమ రిలేషన్‌షిప్‌ను ప్రైవేట్‌గా ఉంచిన ఈ ఇద్దరూ.. పెళ్లి తర్వాత తొలిసారి కలిసి ‘రణబాలి’ జాయింట్ ఇంటర్వ్యూలో తమ ప్రేమ, పెళ్లి, రిలేషన్‌షిప్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒకప్పుడు కో-స్టార్స్‌గా పరిచయమైన వీరిద్దరి బంధం.. స్నేహం నుంచి ప్రేమగా, ఆ తర్వాత పెళ్లి వరకు ఎలా వెళ్లిందో ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రష్మిక చెప్పిన చిన్న చిన్న విషయాలు, విజయ్ చేసిన ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1. ముందుగా ఫ్రెండ్స్.. ఆ తర్వాతే ప్రేమ

రష్మిక, విజయ్‌ల ప్రేమకథ తొలిచూపులోనే మొదలైన లవ్ స్టోరీ కాదట. మొదట ఇద్దరూ కో-స్టార్స్‌గా పరిచయమయ్యారు. ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్‌గా మారారు. ఆ స్నేహమే క్రమంగా ప్రేమగా మారిందని విజయ్ చెప్పాడు. ఈ సందర్భంగా తమకు పరిచయమై ఎన్ని సంవత్సరాలైందనే విషయంలో రష్మిక, విజయ్ మధ్య చిన్న సరదా వాదన కూడా జరిగింది.

విజయ్ ఎనిమిదేళ్లు అని చెప్పగా.. రష్మిక మాత్రం తొమ్మిదేళ్లుగా ఒకరికొకరం తెలుసని కరెక్ట్ చేసింది. అంతేకాదు.. మొదటిసారి కలిసినప్పుడే ఎవరైనా మన ‘ది వన్’ అని చెప్పడం సాధ్యం కాదని విజయ్ అన్నాడు. ఒక వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే టైమ్ కావాలని, ప్రేమ అనేది ఒక అందమైన జర్నీ అని వివరించాడు.

2. ఫస్ట్ డేనే రష్మికను ఏడిపించిన విజయ్!

విజయ్, రష్మిక మొదటి పరిచయం అసలు రొమాంటిక్‌గా లేదట. ‘గీత గోవిందం’ షూటింగ్ సమయంలో రష్మిక.. విజయ్‌ను ‘సర్’ అని పిలిచేదట. అప్పట్లో ఆమె ఇండస్ట్రీకి కొత్త కావడంతో విజయ్ పట్ల చాలా రెస్పెక్ట్‌తో ఉండేదట. ఓ రోజు షూటింగ్‌లో రష్మిక మ్యూజిక్ ప్లే చేస్తుండగా.. విజయ్ దాన్ని ఆపేయమని చెప్పాడట. తాను చాలా డైరెక్ట్‌గా మాట్లాడటంతో ఆ మాట రష్మికకు బాధ కలిగించింది.

తన మాటల వల్ల ఆమె ఏడ్చిందని తర్వాత తెలుసుకున్న విజయ్.. అప్పట్లో తాను అలా మాట్లాడటం తప్పేనని ఒప్పుకున్నాడు. ఇద్దరికీ అప్పటికి అంతగా పరిచయం లేకపోవడంతో తన మాటలను రష్మిక ఎలా తీసుకుంటుందో ఆలోచించలేదని విజయ్ చెప్పుకొచ్చాడు.

3. రష్మిక వల్లే ప్రేమపై విజయ్ అభిప్రాయం మారిందట!

ఒకప్పుడు ప్రేమపై పెద్దగా నమ్మకం ఉండేది కాదని విజయ్ చెప్పాడు. 28–29 ఏళ్ల వయసులో ప్రేమను ఓ ‘మార్కెటింగ్ టర్మ్’లా భావించేవాడినని తెలిపాడు. కానీ వయసు పెరిగే కొద్దీ ప్రేమ విలువ అర్థమైందని, దాన్ని గౌరవించడం, కాపాడుకోవడం నేర్చుకున్నానని చెప్పాడు. చివరకు 36 ఏళ్ల వయసులో పెళ్లికి తాను సిద్ధమయ్యానని విజయ్ చెప్పగా.. రష్మిక మాత్రం ‘‘కాస్త లేట్ కదా!’’ అంటూ సరదాగా ఆటపట్టించింది.

4. తమ రిలేషన్‌ను ఎందుకు ఇన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచారంటే..

రష్మిక–విజయ్ రిలేషన్‌పై ఏళ్లుగా అభిమానుల్లో ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ ఇద్దరూ మాత్రం ఎప్పుడూ తమ పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్‌గా మాట్లాడలేదు. దీనిపై విజయ్ మాట్లాడుతూ.. తాము కావాలనే ఏదో ‘హైడ్ అండ్ సీక్ గేమ్’ ఆడలేదని చెప్పాడు. తమ రిలేషన్ గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం తమకు అనిపించలేదని తెలిపాడు.

రష్మిక కూడా ఇదే విషయాన్ని చాలా క్లియర్‌గా చెప్పింది. తమ రిలేషన్‌షిప్ అనేది ఎవరి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కాదని.. అది తమ ఇద్దరికీ సంబంధించిన విషయమని చెప్పింది. జీవితంలో కొన్ని విషయాలను ప్రైవేట్‌గా ఉంచి కాపాడుకోవడం కూడా ముఖ్యమేనని తెలిపింది.

5. రష్మిక లేకపోతే ఏదో మిస్సింగ్‌గా అనిపించేదట!

తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చిందో విజయ్ చాలా సింపుల్‌గా వివరించాడు. రిలేషన్‌షిప్ క్రమంగా సీరియస్ అవుతున్న కొద్దీ.. తన రోజువారీ జీవితంలో రష్మిక లేకపోవడం మిస్ అవుతున్నట్లు అనిపించేదట. కలిసి వర్క్ చేయడం బాగుండేది.. కలిసి వర్కౌట్ చేయడం మరింత ఈజీగా అనిపించేది.. చివరికి ఒంటరిగా భోజనం చేస్తున్నప్పుడు కూడా ‘రష్మిక ఉంటే ఇంకా బాగుండేది’ అనిపించేదట. అలా తన జీవితంలోని ప్రతి చిన్న విషయంలోనూ రష్మికను మిస్ అవుతున్నానని గుర్తించిన తర్వాతే.. ఆమెతో జీవితాన్ని పంచుకోవాలనే ఆలోచన వచ్చిందని విజయ్ చెప్పాడు.

6. పెళ్లయ్యాక కూడా చిన్న చిన్న ఎఫర్ట్స్ చాలా ముఖ్యం: రష్మిక

పెళ్లి తర్వాత రిలేషన్‌షిప్ ఎలా ఉండాలనే దానిపై రష్మిక చెప్పిన మాటలు కూడా యూత్‌ను బాగా కనెక్ట్ చేసేలా ఉన్నాయి. ఎంత క్లోజ్‌గా ఉన్నా.. పార్ట్‌నర్ కోసం చిన్న చిన్న ఎఫర్ట్స్ చేయడం ఆపకూడదని ఆమె చెప్పింది. ఉదయం ‘గుడ్ మార్నింగ్’ చెప్పడం, ‘ఎలా ఉన్నావు?’ అని అడగడం, ‘నీ రోజు ఎలా గడిచింది?’ అని తెలుసుకోవడం లాంటి చిన్న విషయాలే రిలేషన్‌ను మరింత స్ట్రాంగ్‌గా ఉంచుతాయని తెలిపింది.

‘మన పార్ట్‌నర్‌కు మనం ఎంత ప్రేమిస్తున్నామో ఇప్పటికే తెలుసు కదా’ అని అనుకుని ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా ఉండకూడదని రష్మిక చెప్పింది. ఇక విజయ్ ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టాడు. రష్మిక రోజుకు ఏకంగా 10–15 సార్లు ‘ఐ లవ్ యూ’ చెబుతుందట. తాను కూడా తన ఫీలింగ్స్‌ను బయటకు చెప్పాలని ఆమె తరచూ గుర్తు చేస్తుందని విజయ్ నవ్వుతూ చెప్పాడు.

7. విజయ్ జీవితంలో సెలబ్రేషన్ తీసుకొచ్చింది రష్మికే!

తన జీవితంలో రష్మిక తీసుకొచ్చిన మరో మార్పు గురించి విజయ్ చాలా ప్రత్యేకంగా చెప్పాడు. ఇంతకుముందు తన ఫోకస్ మొత్తం పని, కెరీర్, నెక్స్ట్ మైల్స్‌టోన్‌పైనే ఉండేదని చెప్పాడు. కానీ రష్మికతో ఉన్న తర్వాత జీవితాన్ని కేవలం పని కోసం మాత్రమే కాకుండా.. చిన్న చిన్న విషయాలను సెలబ్రేట్ చేసుకుంటూ, మంచి మెమొరీస్ క్రియేట్ చేస్తూ ఎంజాయ్ చేయాలని అర్థమైందని చెప్పాడు. ఇకపై మరిన్ని హాలిడేస్‌కు వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నానని విజయ్ వెల్లడించాడు. రష్మికకు చిన్న చిన్న మూమెంట్స్‌ను సెలబ్రేట్ చేసుకోవడం, వాటిని మెమొరీస్‌గా మార్చుకోవడం చాలా ఇష్టమని చెప్పాడు.

ఇప్పుడు భార్యాభర్తలుగా స్క్రీన్‌పై రొమాన్స్!

రష్మిక–విజయ్ ఫస్ట్ జాయింట్ ఇంటర్వ్యూ ఆసక్తికరంగా మారడానికి మరో కారణం ఉంది. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘రణబాలి’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత ఈ జోడీ కలిసి నటిస్తున్న మూడో సినిమా ఇది.

అయితే ఈసారి మాత్రం స్క్రీన్‌పై కనిపించబోయే జోడీకి ఓ స్పెషల్ కనెక్షన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్లు కేవలం కో-స్టార్స్ కాదు.. నిజ జీవితంలో భార్యాభర్తలు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 16, 2026న విడుదల కానుంది. ఫిబ్రవరిలో పెళ్లి తర్వాత రష్మిక–విజయ్ కలిసి నటించిన తొలి సినిమా కావడంతో ‘రణబాలి’పై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.