కాక్రోచ్ల నెక్స్ట్ టార్గెట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్.. నిరసనలకు పిలుపునిచ్చిన CJP, AIYAA

కాక్రోచ్ల నెక్స్ట్ టార్గెట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్.. నిరసనలకు పిలుపునిచ్చిన CJP, AIYAA

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో  మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు వదలని కాక్రోచ్ లు.. నెక్స్ట్ టార్గెట్ గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ను ఎంచుకున్నారు. బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రాకు వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా యంగ్ అడ్వకేట్స్ అసోసియేషన్ (AIYAA) 2026 ఆగస్టు 20న నిరసనలకు పిలుపునివ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ (సీజేపీ) అభిజీత్ దీప్కే చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ప్రొటెస్టులో  లాయర్లు పాల్గొనాలని దీప్కే పిలుపునిచ్చారు. ప్రొటెస్టుకు సంబంధించిన వివరాలను ఎక్స్ లో వెల్లడిస్తూ.. చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. 

మనన్, ఇట్ ఈస్ డన్ బ్రో.. లీగల్ కక్రోచ్ లు అంతా ఆందోళనలో జాయిన్ అవుతున్నారు.. అంటూ పోస్ట్ చేశారు. ప్రొటెస్టుకు సంబంధించిన వివరాలను సీజేపీ పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ పోస్ట్ చేయగా.. దాన్ని షేర్ చేస్తూ దీప్కే పై విధంగా రాసుకొచ్చారు. 

లీగల్ కాక్రోచెస్ ఏకమయ్యారు.. బార్ కౌన్సిల్ ఛైర్మన్ కు వ్యతిరేకంగా నిరసనకు దిగుతున్నారు.. ఆగస్టు 20న ఉదయం పది గంటలకు ఆయన రిజైన్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ప్రొటెస్టు చేయనున్నట్లు పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసనలుతెలపనున్నట్లు పేర్కొన్నారు. మరవైపు బాంబే బార్ అసోసియేషన్ కూడా మనన్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేసింది. 

మనన్ కుమార్ నల్సార్ యూనివర్సిటీ కాన్వొకేషన్ విషయంలో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కాన్వొకేషన్ కు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ముఖ్య అతిథిగా రావడాన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీకి లా విద్యార్తులు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో సదరు విద్యార్థులను ఇండియాలో ఉన్న బార్ కౌన్సిల్స్ అన్నీ తిరస్కరించాల్సిందిగా ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయ్యింది. మనన్ కుమార్ నిర్ణయాన్ని సీజైఐ కూడా తప్పుపట్టడంతో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. విద్యా్ర్థులు తమ భావాలను ప్రకటించే స్వేచ్ఛను కలిగి ఉంటారని వివరణ ఇచ్చారు.