బాంబే హైకోర్టు తీర్పుపై.. సుప్రీంకోర్టుకు తరుణ్ తేజ్ పాల్

బాంబే హైకోర్టు తీర్పుపై.. సుప్రీంకోర్టుకు తరుణ్ తేజ్ పాల్

అత్యాచారం కేసులో ముంబై హైకోర్టు తీర్పుపై తెహెల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ముంబై హైకోర్టు కీలక సాక్ష్యాలను సరిగ్గా విచారణ చేయకుండానే తనను దోషిగా తీర్పునిచ్చిందని పిటిషనల్ లో కోర్టుకు తెలిపారు. అయితే మరోవైపు నేరానికి తగిన శిక్ష పడలేదని ముంబై హైకోర్టు తీర్పుపై గోవా ప్రభుత్వం కూడా సుప్రీకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. 

2013 నాటి అత్యాచారం కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ దోషిగా నిర్ధారిస్తూ ముంబై హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. 2021లో ఆయనకు ఇచ్చిన నిర్దోషి తీర్పును హైకోర్టు రద్దు చేసింది. పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 

►ALSO READ | రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: క్యూలో నిలబడే పనే లేదు.. ఇక ఫోన్‌లోనే జనరల్ బోగి టిక్కెట్!

ఈ కేసులో  ముంబై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గురువారం ( ఆగస్టు20) సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు తరుణ్ తేజ్ పాల్. అయితే మరోవైపు గోవా ప్రభుత్వం కూడా ముంబై హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది..తరుణ్ తేజ్ పాల్ కు విధించిన శిక్ష నేరం తీవ్రతకు తగిన విధంగా లేదని.. పదేళ్ల కు మించి శిక్షను ఖరారు చేయాలని కోర్టుకు విజ్ణప్తి చేసింది.