Jailer 2 First Single: 'జైలర్ 2'లో పూర్ణ మాస్ ట్రీట్.. 'అలా బోలోలో'తో మళ్లీ 'కావాలా' మ్యాజిక్!

Jailer 2 First Single: 'జైలర్ 2'లో పూర్ణ మాస్ ట్రీట్.. 'అలా బోలోలో'తో మళ్లీ 'కావాలా' మ్యాజిక్!

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు పూనకాలు తెప్పించే క్రేజీ అప్డేట్ వచ్చేసింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించిన 'జైలర్' సినిమాకు సీక్వెల్ గా వస్తున్న 'జైలర్ 2' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. థియేటర్లలో మరోసారి తలైవా స్వాగ్ ను, ఆయన మార్క్ యాక్షన్ ను ఎంజాయ్ చేయడానికి సమయం దగ్గరపడటంతో మేకర్స్ కూడా ప్రమోషన్ల స్పీడ్ పెంచేసి ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇస్తున్నారు.  

లేటెస్ట్ గా ఫస్ట్ సింగిల్ 'అలా బోలోలో'కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.  ఫస్ట్ పార్ట్ లో తమన్నా 'కావాలా' సాంగ్ తో దేశవ్యాప్తంగా కుర్రకారును ఎలా ఊపేసిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ రికార్డులను బద్దలు కొట్టడానికి 'అల బోలెలో' (Ala Bolelo) అంటూ మరో అల్టిమేట్ మాస్ సాంగ్ రెడీ అయింది. కాకపోతే ఈసారి ఓ రేంజ్ ట్విస్ట్ ఏంటంటే.. తమన్నా ప్లేస్ లోకి నటి 'పూర్ణ' సాలిడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఇందులో తమన్నాను ఏమాత్రం తీసిపోని విధంగా, ఇంకా చెప్పాలంటే ఆమెను మించిపోయే రేంజ్ లో పూర్ణ వేసిన స్టెప్పులు, ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఈ పాటకు మెయిన్ హైలైట్ గా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. ఆగస్టు 21న రాబోతున్న ఈ ఫుల్ సాంగ్ దెబ్బకు, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కు థియేటర్లలో స్పీకర్లు పగిలిపోవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

►ALSO READ | Agadha Actor: గ్రే షేడ్స్‌తో యాక్టింగ్ అదరగొట్టిన శ్రవణ్ రెడ్డి.. ‘అగధ’తో టాలీవుడ్‌లో నెక్స్ట్ లెవెల్ క్రేజ్!

డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సీక్వెల్ ను ఏమాత్రం తగ్గకుండా పాన్-ఇండియా స్కేల్ లో ప్లాన్ చేశాడు. పాత గ్యాంగ్ రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా మీనన్ లాంటి వాళ్లు ఉండనే ఉన్నారు. వాళ్లకు తోడుగా మోహన్ లాల్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఎస్.జె. సూర్య లాంటి ఉద్దండులు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. వీటన్నింటికీ మించి.. బాలీవుడ్ హంక్ హృతిక్ రోషన్ ఈ సినిమాతోనే తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తుండటం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. రజనీకాంత్, హృతిక్ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.

ఇప్పటికే తలైవా తన డబ్బింగ్ పార్ట్ మొత్తం ఫుల్ ఎనర్జీతో కంప్లీట్ చేసుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్ లో పరుగులు పెడుతున్నాయి. అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులను వేటాడేందుకు 'జైలర్ 2' సర్వసన్నద్ధమైంది..