‘డర్టీ హరి’, ‘మంగళవారం’ చిత్రాల తర్వాత టాలీవుడ్ నటుడు శ్రవణ్ రెడ్డి (Shravan Reddy) మరోసారి తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన మిస్టిక్ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ ‘అగధ’ (Agadha)లో ఆయన పోషించిన సింహ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాత్రలోని గ్రే షేడ్స్, మిస్టరీ, సస్పెన్స్‌ను శ్రవణ్ రెడ్డి తన నటనతో అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలోనే నటుడి విలక్షణమైన పెర్ఫార్మన్స్కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తుంది. దీంతో టాలీవుడ్లో మోస్ట్ క్రేజీ స్టార్గా మారే ఛాన్సెస్ ఉన్నట్లు సినీ ఫ్యాన్స్తో పాటు ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
గ్రే షేడ్స్‌లో శ్రవణ్ రెడ్డి నట విశ్వరూపం..
‘అగధ’లో శ్రవణ్ రెడ్డి హీరో, యాంటీ హీరో లక్షణాలు కలగలిసిన విభిన్నమైన పాత్రలో కనిపించారు. సినిమా ప్రారంభంలో ఎంతో సహజంగా, ప్రేక్షకులకు సుపరిచితమైన వ్యక్తిలా కనిపించే ఈ పాత్ర.. కథ ముందుకు సాగుతున్న కొద్దీ తనలో దాగి ఉన్న కొత్త కోణాలను ఒక్కొక్కటిగా బయటపెడుతుంది. ఈ మార్పులను శ్రవణ్ రెడ్డి ఎలాంటి అతిశయోక్తి లేకుండా చాలా సహజంగా పండించారు. ముఖ్యంగా పాత్రలోని పాజిటివ్, నెగెటివ్ షేడ్స్ మధ్య ఉండే సంక్లిష్టమైన గ్రే జోన్‌ను ఆయన తన నటనతో సమర్థంగా చూపించారు.
క్లిష్టమైన గ్రే జోన్: పాజిటివ్, నెగటివ్ షేడ్స్ మధ్య కొట్టుమిట్టాడే ఆ క్లిష్టమైన గ్రే జోన్‌ను శ్రవణ్ ఎంతో సమర్థంగా ఒడిసిపట్టారు. ఆయన ఏమీ చేయకుండా నిశ్శబ్దంగా స్క్రీన్ మీద ఉన్న క్షణాల్లో సైతం, ఆ పాత్ర వెనుక ఇంకేదో పెద్ద మిస్టరీ దాగుందనే భావన ప్రేక్షకులను కంటిన్యూగా వెంటాడుతూనే ఉంటుంది.
— Shravan Reddy (@shravanreddy7_) August 16, 2026
కంట్రోల్డ్ అండ్ ఆష్యూర్డ్ పెర్ఫార్మెన్స్: ఎక్కడా అతి లేకుండా చాలా పద్ధతిగా, అణకువతో కూడిన నియంత్రణతో సాగిన ఈ శ్రవణ్ రెడ్డి పెర్ఫార్మెన్స్ సినిమా ఎండ్ క్రెడిట్స్ పడిపోయిన తర్వాత కూడా మన ఆలోచనల్లో అలాగే నిలిచిపోతుంది.
In 4 days, you’ll discover something far more dangerous, bold & thrilling❤️🔥
— Sri Adi Varaha Productions (@SAVProductions_) August 10, 2026
Feel the chills run down your spine with #Agadha, in cinemas on August 14th👿💥
-- https://t.co/ejvla5mfDY
Written & Directed by @MSRajuOfficial 🎬#AgadhaOnAug14th pic.twitter.com/7ftRhmfHkJ
సాధారణ కమర్షియల్ హారర్ చిత్రాలకు భిన్నంగా మిస్టిసిజం, సూపర్‌నేచురల్ అంశాలతో తెరకెక్కిన ‘అగధ’లో శ్రవణ్ రెడ్డి తన నటనతో సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు. ఈ చిత్రంతో ఆయనలోని నటుడి కొత్త కోణం మరోసారి ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ అద్భుతమైన సక్సెస్ తర్వాత ఆయనకు వరుస అవకాశాలు కన్ఫర్మ్ అవ్వడమే కాకుండా, ఇలాంటి వైవిధ్యభరితమైన పాత్రలు మరెన్నో పడితే టాలీవుడ్‌లో ఆయన నెక్స్ట్ లెవెల్ క్రేజీ స్టార్‌గా ఎదుగడం కన్ఫామ్!
‘అగధ’ కథ...
‘‘అగధ’ అంటే లోతైన అంశం, ఓ శూన్యం అని చెప్పుకోవచ్చు. మనం దేవుడ్ని, దెయ్యాలను కంటితో చూడలేదు. అలాంటి ఫోర్స్‌లకు మధ్య జరిగే కథ ఇది.
‘అగధ’ కథ మహాదేవి (కామాక్షి భాస్కర్ల) అనే యువతి చుట్టూ తిరుగుతుంది. ఆధ్యాత్మిక శక్తులు కలిగిన ఆమె దుష్టశక్తుల బారిన పడినవారికి సహాయం చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె కజిన్ మహిమ అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకోవడంతో అసలు కథ మొదలవుతుంది.
మహిమ మరణం వెనుక ‘అగధ’ అనే భయంకరమైన దుష్టశక్తి ఉందని మహాదేవికి తెలుస్తుంది. మహిమ ప్రియుడు సింహ (శ్రవణ్ రెడ్డి) కూడా ఈ మిస్టరీలో కీలకంగా మారతాడు. అడవిలోని రహస్యమైన గుహ, మిస్టిక్ శక్తులు, కాళతంత్రం వెనుక ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి.
చివరికి తన దైవశక్తితో మహాదేవి అగధను ఎదుర్కొని, తన కుటుంబాన్ని ఆ దుష్టశక్తి నుంచి కాపాడేందుకు పోరాడుతుంది. మహిమ మరణం వెనుక రహస్యం, అగధ అసలు శక్తి, దైవశక్తి–దుష్టశక్తి మధ్య పోరాటమే సినిమా ప్రధాన కథ.
