రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్స్ జరిపారు. ఏఓగా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డిపై అవినీతి ఆరోపణలతో 2026 ఆగస్టు 20న ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఆయన ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
శ్రీనివాస్ రెడ్డి గతంలో మహేశ్వరం, బాలాపూర్, శంషాబాద్ కార్యాలయాల్లో ఎమ్మార్వో గా పనిచేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో ల్యాండ్ ప్రొటెక్షన్ వింగ్ లో తహసీల్దార్ గా పనిచేశాడు. 2026 మే నెలలో కలెక్టర్ కార్యాలయం నుంచి డిప్యుటేషన్ పై ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ అయిన ఆయన ప్రస్తుతం ఏవోగా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ మధ్యకాలంలోనే ఆర్డీఓతో కలిసి మహేశ్వర్ రెడ్డి పనిచేయడంతో.. వీరి ఇరువురి మధ్య ఏమైనా ఆర్థిక సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
►ALSO READ | కొండా సుస్మిత వ్యాఖ్యలు బాధాకరం.. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
