మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీలో ఎవరికి వారే అభ్యర్థులం అంటే కుదరదని అన్నారు. నిజామాబాద్ లో 2026 ఆగస్టు 20న మాట్లాడిన ఆయన..కొండా సుస్మిత వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు.
పార్టీలైన్ దాటి ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు పీసీసీ చీఫ్. సీనియర్ నేత చిన్నారెడ్డి, కొండా సుస్మిత వ్యాఖ్యలు బాధాకరమని.. వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. వివరణ ఇచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పార్టీలో అభ్యర్థులను ఎవరు ప్రకటించినా చెల్లదని.. ఎవరికి వారు తామే అభ్యర్థులం అంటూ ప్రకటనలు చేయవద్దని హెచ్చరించారు. పార్టీ లో పాతవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీలో బీసీలు, మైనార్టీలకు తగిన గుర్తింపు లభిస్తోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీల నుంచి కొందరు నేతలు రావడంతో కాంగ్రెస్ మరింత బలపడిందన్నారు.
22 ఏ వల్ల భూదందా, అన్యాక్రాంతానికి అవకాశం ఉండదు:
- 22 ఏ పై బి.ఆర్.ఎస్. అనవసర రాద్దాంతం చేస్తోంది
- కింది స్థాయిలో జరిగిన తప్పిదం మా దృష్టికి వచ్చింది
- లోపాలను సరిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు
- తప్పిదం జరిగిందని సాక్ష్యాత్తు మంత్రి ప్రకటించి సరిదిద్దారు.
- 22 ఏ వల్ల భూదందా, భూముల అన్యాక్రాంతానికి అవకాశం ఉండదు.
- మా ప్రభుత్వంలో సామాన్యులకు అన్యాయం జరిగితే గాంధీ భవన్ తలుపులు తట్టవచ్చు.
- పోచారం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయనతో మాట్లాడాం
- ఆయన ఆవేదనను అర్ధం చేసుకున్నాం
- నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ లో సీనియర్ నేతలకు 70 శాతం పదవులు ఇస్తాం
- బాన్సువాడ లో పాత కొత్త నేతల కలయికతో ముందుకు వెళ్తాం
- పోచారం కాంగ్రెస్ సిద్ధాంతాలకు, సంక్షేమానికి మద్దతుగా ఉన్నారు...
- కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం సాధ్యం..
