రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: క్యూలో నిలబడే పనే లేదు.. ఇక ఫోన్‌లోనే జనరల్ బోగి టిక్కెట్!

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్: క్యూలో నిలబడే పనే లేదు.. ఇక ఫోన్‌లోనే జనరల్ బోగి టిక్కెట్!

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై భారతీయ రైళ్లలోని జనరల్ బోగీల (అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు)  టిక్కెట్ తీసుకోవడానికి స్టేషన్‌లో గంటల తరబడి లైన్లలో నిలబడే ఇబ్బంది లేకుండా, ఇప్పుడు మీ ఫోన్‌లోనే ఈజీగా బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు, డిజిటల్ పద్ధతిలో టిక్కెట్ తీసుకుంటే 3% ప్రత్యేక డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అవును...  రైళ్లలోని జనరల్ కోచ్ లో ప్రయాణించే వారు స్టేషన్లలోని కౌంటర్ల వద్ద ఉండే పొడవైన క్యూలను చూసి ఇబ్బంది పడుతుంటారు. ఈ తలనొప్పి లేకుండా ప్రయాణికులు ఇంటి నుంచే లేదా ఎక్కడి నుంచైనా మొబైల్ ద్వారా రిజర్వేషన్ లేని అంటే అన్‌రిజర్వ్‌డ్ కోచ్  టిక్కెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్ని భారతీయ రైల్వే ఇప్పుడు కల్పిస్తోంది.

స్టేషన్ల వద్ద రద్దీని తగ్గించడానికి రైల్వే శాఖ 'రైల్‌వన్' (Rail One) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు ఎంతో సులభంగా  టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.  ఈ విషయాన్ని 'ఎక్స్' ద్వారా షేర్ చేసారు. 

టిక్కెట్లపై 3% డిస్కౌంట్
డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ ఈ ప్రత్యేక ఆఫర్ ఇస్తోంది. రైల్‌వన్ యాప్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకుంటే ఛార్జీలపై 3% తగ్గింపు లభిస్తుంది. దీనివల్ల క్యూలో నిలబడే శ్రమ తప్పుతుంది, పైగా డబ్బు కూడా ఆదా అవుతుంది. యూపీఐ (UPI), నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా సులభంగా పేమెంట్ చెయ్యొచ్చు.

►ALSO READ | హోటల్స్, హాస్పిటల్స్, మాల్స్‌పై సుప్రీం కోర్టు షాకింగ్ తీర్పు.. కరెంట్, వాటర్ కనెక్షన్ కట్!

ఫోన్‌లో టిక్కెట్ బుక్ చేసుకునే విధానం:
*ముందుగా మీ ఫోన్‌లో ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌కి వెళ్లి 'రైల్‌వన్' యాప్‌ను  డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోండి.
*మీకు ఇప్పటికే IRCTC అకౌంట్ ఉంటే దాంతో లాగిన్ అవ్వవచ్చు లేదంటే మీ మొబైల్ నంబర్, ఓటీపీ (OTP) ఎంటర్ చేసి కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు యాప్‌ను తెరిచినప్పుడు, లొకేషన్ & నోటిఫికేషన్‌ల కోసం అడిగే ఏవైనా అనుమతులను ఇవ్వండి.
*యాప్ ఓపెన్ చేశాక హోమ్ స్క్రీన్‌లో 'బుక్ టికెట్స్'లోకి వెళ్లి, 'అన్‌రిజర్వ్‌డ్ టికెట్' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. 
*ఇప్పుడు మీరు ఏ స్టేషన్ నుంచి ఎక్కాలనుకుంటున్నారో, ఎక్కడికి వెళ్లాలో,  ప్రయాణ తేదీ వివరాలు ఎంటర్ చేయండి.
*తరువాత యూపీఐ లేదా ఇతర పద్ధతిలో డబ్బు పేమెంట్ చేయగానే  క్యూఆర్ (QR) కోడ్‌తో  మీ జనరల్ టిక్కెట్ డైరెక్ట్ మీ మొబైల్ స్క్రీన్‌పై చూపిస్తుంది. 
*ఇప్పుడు  మీ టిక్కెట్‌ను మీ మొబైల్‌లో 'SAVE' చుసుకోవచ్చు.