వాళ్లకు కొత్త సిమ్లు ఇవ్వొద్దు.. టెలికాం శాఖ కీలక ఆదేశాలు

వాళ్లకు కొత్త సిమ్లు ఇవ్వొద్దు.. టెలికాం శాఖ కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ: ఇప్పటికే తొమ్మిది మొబైల్ సిమ్ కార్డులు ఉన్న వారికి కొత్తవి ఇవ్వకూడదని టెలికాం ఆపరేటర్లను టెలికాం శాఖ (డాట్​) ఆదేశించింది. ఆగస్టు 24 నుంచి కొత్త రూల్​ అమల్లోకి రానుంది. తొమ్మిదికి మించి కనెక్షన్లు కోరేవారిని గుర్తించడానికి టెల్కోలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.  

వీరి వివరాలను సేకరించేందుకు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫారమ్​ను (డీఐపీ) ఉపయోగించాలని సూచించింది. ఈ పరిమితి దాటిన వారి ఫోటోలు ఆగస్టు 23 నుంచి డీఐపీలో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నిబంధనలు అమలు చేసేవరకు పరిమితికి మించి యాక్టివేట్ అయిన సిమ్ కార్డులకు సేవలను నిలిపివేయాలని డాట్​ఆదేశించింది.