న్యూఢిల్లీ: ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (ఐజీపీఎల్) సీజన్–2 సెకెంట్ హాఫ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ దశలో మొత్తం తొమ్మిది టోర్నీలు జరగనుండగా, అందులో ఎనిమిదింటికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. గగన్‌జీత్ భుల్లర్, కరణ్‌దీప్ కొచ్చర్, జీవ్ మిల్కా సింగ్, సచిన్ బైసోయా తదితర ప్రముఖ గోల్ఫర్లు బరిలోకి దిగనున్నారు.
తొలి టోర్నీ సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు యూఏఈలోని రాస్ అల్ ఖైమాలో ఉన్న అల్ హమ్రా గోల్ఫ్ కోర్స్‌లో జరుగనుంది. అనంతరం 10 ఫ్రాంచైజీలతో కూడిన లీగ్ భారత్‌కు తరలివస్తుంది.
సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు న్యూఢిల్లీలో, అక్టోబర్ 6–8 వరకు హైదరాబాద్‌లో, అక్టోబర్ 13–15 వరకు అహ్మదాబాద్‌లో పోటీలు జరుగుతాయి. నవంబర్ 3–5 వరకు విశాఖపట్నం, 10–12 వరకు మరోసారి హైదరాబాద్, 17–19 వరకు పుణెలో టోర్నీలు నిర్వహించనున్నారు.
