ఉద్యానవన పంటల సాగుతో ఆదాయం : దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

ఉద్యానవన పంటల సాగుతో ఆదాయం : దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
  •      ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్ కలెక్టరేట్/ చిన్న చింతకుంట, వెలుగు : రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు నీటి వనరులు, భూసారాన్ని పరిరక్షించేందుకు ఉద్యానవన, తక్కువ నీటి వినియోగ పంటల సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం భూత్పూర్ మండలం శేరిపల్లి గ్రామంలో జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.  మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, ఆయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పామ్, చిరుధాన్యాలు వంటి పంటలను సాగు చేయాలని సూచించారు.  

సమావేశం అనంతరం అధికారులతో కలిసి శేరిపల్లిలోని కూరగాయల తోటలను పరిశీలించిన నేతలు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించే మార్గాలను రైతులకు వివరించారు. వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమ, ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలని ఎస్​పీడీసీఎల్​ సీఎండీ జితేశ్​ పాటిల్ సూచించారు.  సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ప్రయోగాత్మకంగా పంటల మార్పిడిని చేపట్టి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా చెప్పారు. 

కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి సాగునీరు విడుదల

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా దిగువకు సాగునీటిని ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని దృష్టిలో ఉంచుకుని చెరువులను నింపడంతో పాటు బోర్లు రీచార్జ్ అయ్యేలా  నీటిని విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. రైతులు ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలని సూచించారు. చిన్న చింతకుంట మండలం లాల్కోట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే పాల్గొన్నారు.