పాక్పై భారత్‌‌ పంజా.. హాకీ వరల్డ్ ‌కప్లో 5-3తో చిరకాల ప్రత్యర్థిపై ఘన విజయం

పాక్పై భారత్‌‌ పంజా.. హాకీ వరల్డ్ ‌కప్లో 5-3తో చిరకాల ప్రత్యర్థిపై ఘన విజయం
  • హర్మన్‌‌ ప్రీత్‌‌, అభిషేక్‌‌ చెరో రెండు గోల్స్‌‌

 
ఆమ్‌‌స్టెల్వీన్‌‌: ఎఫ్‌‌ఐహెచ్‌‌ పురుషుల హాకీ వరల్డ్‌‌కప్‌‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌పై భారత్‌‌ సత్తా చాటింది. బుధవారం జరిగిన చివరి పూల్‌‌–డి మ్యాచ్‌‌లో టీమిండియా 5–3 గోల్స్‌‌ తేడాతో పాకిస్తాన్‌‌ను ఓడించింది. కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌, అభిషేక్‌‌ చెరో రెండు గోల్స్‌‌తో భారత విజయంలో కీలకపాత్ర పోషించారు.

మ్యాచ్‌‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్‌‌కు ఐదో నిమిషంలో హర్మన్‌‌ప్రీత్‌‌ పెనాల్టీ కార్నర్‌‌ను గోల్‌‌గా మలిచి ఆధిక్యం అందించాడు. 11వ నిమిషంలో అభిషేక్‌‌ అద్భుతమైన ఫీల్డ్‌‌ గోల్‌‌తో స్కోరును 2–0కు పెంచాడు. 21వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్‌‌ను హర్మన్‌‌ప్రీత్‌‌ గోల్‌‌గా మలిచాడు.

పాక్‌‌ తరఫున 22వ నిమిషంలో హన్నాన్‌‌ షాహిద్‌‌ గోల్‌‌ చేయగా.. 24వ నిమిషంలో అభిషేక్‌‌ మరో ఫీల్డ్‌‌ గోల్‌‌తో భారత్‌‌ ఆధిక్యాన్ని కొనసాగించాడు. అదే నిమిషంలో సుఫ్యాన్‌‌ ఖాన్‌‌ పాక్‌‌కు రెండో గోల్‌‌ అందించాడు. 35వ నిమిషంలో వైస్‌‌ కెప్టెన్‌‌ హార్దిక్‌‌ సింగ్‌‌ పెనాల్టీ స్ట్రోక్‌‌ను గోల్‌‌గా మలిచి భారత్‌‌ స్కోరును ఐదుకు చేర్చాడు. 46వ నిమిషంలో హన్నాన్‌‌ షాహిద్‌‌ తన రెండో గోల్‌‌ చేసినప్పటికీ పాక్‌‌కు ఓటమి తప్పలేదు. చివరకు భారత్‌‌ 5–3తో విజయాన్ని సొంతం చేసుకుంది.