బాలిక షార్ట్స్ వేసుకుందని కుటుంబంపై దాడి..మహారాష్ట్రలోని సింహగఢ్కోటలో ఘటన

బాలిక షార్ట్స్ వేసుకుందని కుటుంబంపై  దాడి..మహారాష్ట్రలోని సింహగఢ్కోటలో  ఘటన

పుణె: మహారాష్ట్రలోని ప్రసిద్ధ చారిత్రక ప్రాంతమైన సింహగఢ్ కోట వద్ద దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. వారాంతంలో ఆహ్లాదంగా గడుపుదామని వచ్చిన పర్యాటకులకు చేదు అనుభవం ఎదురైంది. ఎనిమిదేండ్ల పాప షార్ట్స్ ధరించి రావడంపై కోట దగ్గర కొందరు యువకులు అభ్యంతరం తెలిపారు. బాలికతో పాటు, ఆమె కుటుంబంపై దాడి చేసి భయాందోళనలకు గురిచేశారు. 

ఈ నెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  వీకెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక కుటుంబం సింహగఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోటను సందర్శించేందుకు వచ్చింది. ఆ కుటుంబంలోని ఎనిమిదేండ్ల చిన్నారి షార్ట్స్ వేసుకోవడాన్ని ఫోర్ట్ కన్జర్వేషన్ సొసైటీ (కోటల పరిరక్షణ సంఘం) సభ్యులమని చెప్పుకునే ఓ గుంపు ప్రశ్నించింది. దీనిపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగగా, ఆ గుంపు వారిపై దాడికి దిగింది.