డ్రగ్ టెస్టులో పాజిటివ్‌‌.. ఆస్ట్రేలియా టెన్నిస్‌‌ స్టార్‌‌పై సస్పెన్షన్‌‌

డ్రగ్ టెస్టులో పాజిటివ్‌‌.. ఆస్ట్రేలియా టెన్నిస్‌‌ స్టార్‌‌పై సస్పెన్షన్‌‌

జెనీవా: ఆస్ట్రేలియా టెన్నిస్‌‌ స్టార్‌‌, మాజీ వింబుల్డన్‌‌ ఫైనలిస్ట్‌‌ నిక్‌‌ కిర్గియోస్‌‌ డోపింగ్‌‌ వివాదంలో చిక్కుకున్నాడు. కొకైన్‌‌ పరీక్షలో పాజిటివ్‌‌గా తేలడంతో 31 ఏళ్ల కిర్గియోస్‌‌పై తాత్కాలిక సస్పెన్షన్‌‌ విధించారు. జూన్‌‌ 22న స్పెయిన్‌‌లో జరిగిన ఓ లోయర్‌‌ టియర్‌‌ గ్రాస్‌‌కోర్టు టోర్నీ సందర్భంగా అతడి నమూనాలను సేకరించగా, జూలై 17న పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది.

దీంతో ఆగస్టు 4 నుంచి సస్పెన్షన్‌‌ అమల్లోకి వచ్చినట్లు ఇంటర్నేషనల్‌‌ టెన్నిస్‌‌ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) తెలిపింది. తాను కొకైన్‌‌ పరీక్షలో పాజిటివ్‌‌గా తేలిన విషయాన్ని కిర్గియోస్‌‌ సోషల్‌‌ మీడియా ద్వారా వెల్లడించాడు.