యూఏఈపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి

యూఏఈపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి
  • ఒకటి తమ జలాల్లో, మరొకటి అవతల పడిందన్న యూఏఈ రక్షణ శాఖ 

అబుదాబి: ఇరాన్ తమ దేశంపైకి రెండు రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని యూఏఈ రక్షణ శాఖ వెల్లడించింది. ఆ క్షిపణుల్లో ఒకటి తమ సముద్రజలాల్లో, మరొకటి ఆవల పడిందని తెలిపింది. అయితే, ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి దేశం సిద్ధంగా ఉందని తెలిపింది. ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి క్షిపణి దాడుల ముప్పుపై యూఏఈ విపత్తు నిర్వహణ సంస్థ ‘ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఈఎంఏ’, హోంశాఖ మంగళవారం రాత్రి వేర్వేరుగా హెచ్చరికలు జారీ చేశాయి. 

తదుపరి అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వచ్చేంతవరకూ ప్రజలంతా సేఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఉండాలని సూచించాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే హెచ్చరికలను ఉపసంహరించుకున్నాయి. దేశానికి బాలిస్టిక్ మిసైల్ దాడి ముప్పు ఉందంటూ అలర్ట్ జారీ చేయడం గత కొన్ని నెలల్లో ఇదే తొలిసారి. కాగా, పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు 60 రోజుల్లో తుది ఒప్పందం చేసుకునేందుకుగాను ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన అవగాహన గడువు సోమవారం నాటితో ముగిసింది.